
ఇంటర్నెట్‌లో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక వీడియో నెటిజన్లను, ఆహార భద్రతా అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిత్యం మనం వంటల్లో వాడే ఆవనూనె భారీ ట్యాంక్‌లో ఒక వ్యక్తి దిగి హ్యాపీగా స్నానం చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో, ఒక ఆవనూనె ప్రాసెసింగ్ లేదా రీఫైనింగ్ యూనిట్‌కు చెందిన భారీ ట్యాంక్‌లో నూనె నింపి ఉంది. అందులో ఒక వ్యక్తి ఎటువంటి భయమూ లేకుండా దిగి, నూనెను ఒంటికి పూసుకుంటూ స్నానం చేస్తున్నాడు. శుభ్రత, పరిశుభ్రతకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ఘోర కలికాలాన్ని చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము రోజూ వంటల్లో వాడే నూనె ఎంతవరకు సురక్షితం? అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియోను విపరీతంగా షేర్ చేశారు.
ఈ వీడియో తీవ్ర కలకలం రేపడంతో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తక్షణమే స్పందించింది. ఆహార పదార్థాల తయారీ ప్రాంతాల్లో ఇటువంటి అసహ్యకరమైన, ప్రమాదకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. వీడియో ఆధారంగా అది ఏ కంపెనీకి చెందిందో, ఏ ప్రదేశంలో జరిగిందో గుర్తించేందుకు FSSAI ప్రత్యేక విచారణ బృందాలను రంగంలోకి దించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన సదరు ఆయిల్ మిల్లు లేదా కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
వీడియో ఇక్కడ చూడండి..
सरसों के तेल में मजदूर ने लगाई डुबकी! 😳
जहाँ तैयार होता है कच्ची घानी सरसों का तेल, वहीं एक मजदूर तेल के अंदर नहाता नजर आया।
वीडियो देखकर लोग भी हैरान हैं—आखिर तेल में ये कैसी डुबकी है? 😐
कुछ लोग इसे देखकर कहेंगे कि भाई साहब तेल में स्नान कर रहे हैं! 😂
लेकिन पूरा मामला… pic.twitter.com/KhTwjhx7Ke
— PRIYA RANA (@priyarana3101) August 23, 2026
ఆహార పదార్థాల తయారీ, ప్యాకింగ్ కేంద్రాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు సరిగ్గా అమలు కావడం లేదనడానికి ఈ సంఘటన నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. నిత్యావసర వస్తువులను తయారుచేసే ప్రతి సంస్థలోనూ క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం, బహిరంగంగా, అపరిశుభ్రంగా అమ్మే నూనెను కొనకుండా ఉండటమే వినియోగదారులకు ఉత్తమం. ప్యాక్ చేసిన నూనెను కొనుగోలు చేసేటప్పుడు, లేబుల్, ప్యాకేజింగ్, FSSAI లైసెన్స్ వివరాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని తప్పకుండా తనిఖీ చేయండి. కేవలం ధర తక్కువగా ఉందని తెలియని ఉత్పత్తిని కొనడం కూడా తెలివైన నిర్ణయం కాదు.