భారత నౌకాదళ సన్నాహక విన్యాసాల్లో పెద్ద ప్రమాదం తప్పింది. తొలిసారిగా ఈ ఏడాది భారత నేవీ-డే వేడుకలను ఒడిశాలోని పూరి సాగర తీరంలో నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు సన్నాహక విన్యాసాల్లో పాల్గొనగా ఒక్కసారిగా ఓ పక్షి ఎగురుతూ వాటిమధ్యలోకి వచ్చింది. ఆ పక్షి గమనాన్ని పైలెట్లు గమనించి అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.
ఇకపోతే, తొలిసారిగా ఈ ఏడాది భారత నేవీ-డే వేడుకలను ఒడిశాలోని పూరి సాగర తీరంలో ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళ యంత్రాంగం, ఆ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సన్నాహాలను చేపట్టాయి. ఇందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎయిర్ క్రాఫ్ట్స్ , హెలికాప్టర్ల సన్నాహక విన్యాసారాల్లో పాల్గొన్నాయి. హెలికాప్టర్లు గాల్లో ఉన్న సమయంలో సడెన్‌గా ఓ పక్షి ఎగురుకుంటూ వాటి మధ్యలోకి వచ్చింది. ఆ పక్షిని గమనించిన ఫైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
#WATCH | Odisha | Indian Navy held rehearsal at Puri beach ahead of Navy Day celebration on December 4 (30.11) pic.twitter.com/hng3E0Wt0g
— ANI (@ANI) December 1, 2024
పైలెట్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నేవీ విన్యాసాలకు 15రోజులు ముందుగానే తీరం వెంబడి ఎలాంటి తినుబండారాలు, వ్యర్థాలు లేకుండా పర్యవేక్షించాల్సి ఉంటుందని..అలా చేయకపోతే పక్షుల తాకిడిని అరికట్టడం కష్టంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..