Viral Video: మమ్మీ ఈ లోకంలో ఉండాలని లేదు.. హోమ్‌వర్క్‌ చేయమంటే బుడ్డొడి ఎదురు సమాధానం

Viral Video: పాఠశాల నుంచి రాగానే పిల్లలు ఎలాంటి హోంవర్క్‌ చేయకుండా సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటారు. స్నేహితులతో కలిసి వివిధ రకాల గేమ్స్‌ ఆడుకుంటారు...

Viral Video: మమ్మీ ఈ లోకంలో ఉండాలని లేదు.. హోమ్‌వర్క్‌ చేయమంటే బుడ్డొడి ఎదురు సమాధానం

Updated on: Aug 01, 2022 | 8:51 PM

Viral Video: పాఠశాల నుంచి రాగానే పిల్లలు ఎలాంటి హోంవర్క్‌ చేయకుండా సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటారు. స్నేహితులతో కలిసి వివిధ రకాల గేమ్స్‌ ఆడుకుంటారు. ఎందుకంటే స్కూ్‌ల్‌లో రాసిరాసి, చదివి చదివి అలసిపోతారు. ఇక ఇంటికి రాగానే హోమ్‌ వర్క్‌ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. సరదాగా ఆడుకుంటేనే వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్కూల్‌లో ఉండి ఇంటికి రాగానే హోమ్‌వర్క్‌ చేసుకోవాలంటే వారికి బద్దకంగా ఉంటుంది. హోమ్‌ వర్క్‌ చేసుకోవాలని తల్లి చెబుతుంటూ అసహనం వ్యక్తం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన ఈ పిల్లోడి మాటలు వింటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ పిల్లాడు మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. హిందీ బుక్‌ ఓపెన్‌ చేసిన ఈ బుడ్డోడు తన తల్లికే ఎదురు సమాధానం ఇస్తున్నాడు. హోమ్‌ వర్క్‌ చేయలేక తాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని అనుకుంటున్నానని పదేపదే పెన్సీల్‌తో బాదుతూ తల్లితో చెప్పడం షాక్‌కు గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

 

అయితే ఈ లోకం నుంచి ఎందుకు వెళ్లిపోవాలని అనుకుంటున్నావని తల్లి ఆ బుడ్డొడిని అడుగగా, నాకు ఈ ప్రపంచం అవసరం లేదు.. నువ్వు అందంగా లేవు అంటూ బదులివ్వడంతో తల్లి ఒక్కసారిగా పగలబడి నవ్వేసింది. ఈ పిల్లాలు మాట్లాడిన వీడియో ఎమోబోయిస్‌ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి