Viral Video: వరదల్లో కొట్టుకుపోయిన బొలెరో వాహనం.. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది..

|

Jul 19, 2022 | 1:45 PM

Madhya Pradesh Heavy Rains: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిని జిల్లా మహిద్‌పూర్‌లో ఓ బొలెరో వాహనం వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.

Viral Video: వరదల్లో కొట్టుకుపోయిన బొలెరో వాహనం.. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది..
Ujjain Floods Viral Video
Follow us on

Madhya Pradesh Floods: మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని నదలు, వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కొందరు ప్రమాదవశాత్తున వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఘటనల్లో కొందరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇలాంటి ఘటనలకు సంబందించిన షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిని జిల్లా మహిద్‌పూర్‌లో ఓ బొలెరో వాహనం వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ వీడియోలో వరద నీటిలో బొలెరో వాహనం కొట్టుకుపోతున్న దృశ్యాన్ని చూడవచ్చు.

బొలెరో వాహనం బ్రిడ్జి పైకి రాగానే నీటి ప్రవాహ తీవ్రతను అంచనావేయడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. ప్రవాహ తీవ్ర ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జి దాటేందుకు ప్రయత్నించొద్దని అక్కడున్న వారు వారించినా డ్రైవర్ వెనక్కి తగ్గలేదు. వాహనంలో వరదను దాటేయొచ్చని డ్రైవర్ భావించాడు. అయితే ప్రవాహంలో కొంచెం ముందుకు వెళ్లాక వాహనం ఆగిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అందులో వాహనం కొట్టుకపోయింది. వాహనంలోని ముగ్గురు వ్యక్తులు.. వాహనం బయటకు దూకి గట్టుకు చేరుకున్నారు. అలా ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డారు. క్షణాల వ్యవధిలోనే ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో కారు కొట్టుకుపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనను మరో గట్టుపై ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు.

ఇవి కూడా చదవండి

వరదల్లో కొట్టుకుపోతున్న వాహనం.. వీడియో

ఉధృతంగా ప్రవహించే నదిపై వాహనాలు నడిపే వారందరికీ ఈ వీడియో ఒక గుణపాఠంలా ఉంది. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇది చూసి అందరూ ప్రాణం అమూల్యమైనదని.. దానితో ఆడుకోకూడదని సలహా ఇస్తున్నారు. ప్రకృతితో ఢీకొట్టేందుకు ప్రయత్నించొద్దని కొందరు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి