Margaret Alva: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా మార్గరెట్ అల్వా నామినేషన్.. పోలింగ్ ఎప్పుడంటే..
Vice Presidential Elections 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వాను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. అల్వా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ..
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా నామినేషన్ వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వాను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. అల్వా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ , అధిర్‌రంజన్ చౌదరి , శరద్‌పవార్, సీతారాం ఏచూరి , డీరాజా తదితరులు హాజయ్యారు. బీజేపీ అభ్యర్ధిగా జగ్‌దీప్ ధన్‌కర్ ఇప్పటికే నామినేషన్ వేశారు. వచ్చే నెల 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికల జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చిన శివసేన ఉద్ధవ్ వర్గం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతిస్తోంది. మార్గరెట్ అల్వా నామినేషన్ కార్యక్రమానికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హాజరయ్యారు.
లోక్‌సభ, రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో బిజెపికి మెజారిటీ ఉన్నందున ధనఖర్ వైస్ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు సభ్యుల సంఖ్య 780లో బీజేపీకి మాత్రమే 394 మంది ఉన్నారు.
#WATCH | Opposition’s Vice-Presidential candidate Margaret Alva files her nomination papers at Parliament, in the presence of Congress leaders Rahul Gandhi, Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury, NCP chief Sharad Pawar, Shiv Sena’s Sanjay Raut and other Opposition leaders. pic.twitter.com/oHmMvB6ij3
— ANI (@ANI) July 19, 2022
ఈ సంఖ్య మెజారిటీ సంఖ్య 390 కంటే ఎక్కువ. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియగా.. కొత్త ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఓటింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.