Luxury Fashion Brand: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ బ్రాండ్ కోరుకుంటున్నారు. కాళ్లకు ధరించే చెప్పులు, మొహానికి ఉపయోగించే కాస్ట్యూమ్స్, వేసుకునే దుస్తులు ఇలా ప్రతీదీ బ్రాండెడ్ కోసమే ఆలోచిస్తుంటారు. అయితే, బ్రాండ్‌ల పేరుతో మార్కెట్‌లోకి విచిత్రమైన దుస్తులు, వస్తువులు విడుదలవుతున్నాయి. తాజాగా ఓ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ అలాంటి స్వెటర్‌ని తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ స్వెటర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నేటి ఫ్యాషన్ పోకడలను గమనిస్తే.. ఇది నిజంగా షాకింగ్‌గానే ఉంటుంది. అత్యంత తక్కువ ధరలు ఖరీదు చేసే వస్తువులను కూడా బ్రాండ్ పేర్లతో ఊహించని స్థాయిలో ధరలు నిర్ణయిస్తున్నారు. ఇక దాని ధర ఎంత ఎక్కువ ఉంటే.. అంత బ్రాండ్ అన్నట్లుగా మనుషులు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఆ బ్రాండెడ్ కంపెనీ విడుదల చేసిన స్వెటర్ ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలెన్సియాగా డిజైనర్లు తమ కస్టమర్ల కోసం కొత్త స్వెటర్‌ను తయారు చేశారు. చిరిగిపోయినట్లుగా ఉన్న ఈ స్వెటర్ ధరను 1,450 డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో చూసినట్లయితే.. అది సుమారు రూ. లక్ష. అయితే ఈ స్వెటర్‌ను చూస్తే షాక్ అవుతారు. చాలా సంవత్సరాల పాటు పాత ఇనుప పెట్టెలో దాడిపెడితే.. ఎలుకలు కొరికినట్లుగా ఉంటుంది. అయితే, ఈ స్వెటర్‌ని, దాని ధరను బాలెన్సియాగా కంపెనీ.. సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. విచిత్రంగా స్పందిస్తున్నారు. దానిపై సెటైర్లు వేస్తున్నారు.
ఒక నెటిజన్ అయితే మరో అడుగు ముందుకు వేసి దారుణమైన కామెంట్ చేశారు. ‘‘ఈ స్వెటర్‌ని ధరిస్తే బిచ్చగాళ్ల ముఠా నుంచి పారిపోయిన సభ్యుడిగా భావిస్తారు.’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ స్వెటర్‌ను దరించి ఇంటికి వస్తే.. ఇంట్లోకి కూడా రానివ్వరు అని మరో సోషల్ మీడియా యూజర్ పేర్కొన్నారు. మరొకరైతే.. ఈ స్వెటర్‌ను ధరించినట్లయితే.. మీరు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకువచ్చిన వారిలా.. జంతువుల దాడి నుంచి తప్పించుకున్న వారిలా కనిపిస్తారంటూ మరికొందరు పేర్కొన్నారు. అయితే, చిరిగిపోయినట్లుగా ఉన్న ఈ స్వెటర్‌ను అధిక నాణ్యత గల ఉన్నితో తయారు చేశారు. ఇది గొర్రె వెంట్రుకలను మొదటిసారి కత్తిరించడం ద్వారా వచ్చే ఉన్ని ద్వారా దీనిని తయారు చేసినట్లు బాలెన్సియాగా ప్రకటించింది.
People are literally paying $1,450 for a destroyed Balenciaga sweater. Recession indicator ? pic.twitter.com/lqYeYOaMlt
— Dom (@DomAesthetics) August 26, 2021
Also read:
Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..
Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..