లవ్ ప్రపోజల్.. ప్రేమికులందరికీ ఇదో పరీక్షగా చెప్పొచ్చు.. ఎందుకంటే, కొందరు ప్రేమికులు, తమ ప్రేమను ఎదుటివారికి తెలియజేసేందుకు భయపడుతుంటారు. ఎక్కడ తమను తిరస్కరిస్తారో అని సంశయిస్తారు. అంతేకాదు, తమ ప్రేమను ప్రకటించేందుకు నానా తంటాలు పడతారు. లవ్ ప్రపోజల్ ఎప్పటికీ గుర్తిండిపోయేలా వెరైటీగా ఉండేలా లవర్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తూ ఉంటారు. రకరకాల ఫీట్లతో విభిన్నంగా ప్రయత్నిస్తారు. మనసులోని ప్రేమను ప్రేయసి లేదా ప్రియుడికి వ్యక్తపరచడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటారు. అయితే, ఇక్కడ కూడా ఓ యువకుడు మోకాళ్లపై కూర్చొని తన ప్రియురాలికి ప్రపొజ్ చేస్తున్నాడు. యువకుడి చేతిలో ఉంగరం ఉంది. అయితే అంతలోనే మరో వ్యక్తి తన చేతిలోని ఉంగరం లాక్కుని పెద్ద షాకే ఇచ్చాడు..ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలు సంగతి ఏంటంటే..
ఈ సంఘటన పారిస్‌లోని డిస్నీల్యాండ్‌లో జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో, తెల్లటి టీ-షర్ట్ ధరించిన వ్యక్తి డిస్నీల్యాండ్ ముందు తన ప్రేయసికి ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు..అందుకోసం అతడు ఎలా మోకరిల్లుతున్నాడో మనం వీడియోలో చూడొచ్చు..అతని చేతిలో ఓ చిన్న బాక్స్ ఉంది..అందులోంచి అతను డైమండ్ రింగ్ తీసి అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాడు. ఇంతలోనే అతనికి ఊహించని షాక్ తగిలింది. యువకుడు తన లవర్ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం ఇస్తున్న టైమ్‌లోనే ఎంటరైన మరో వ్యక్తి ఆ ఉంగరం లాక్కుని వేగంగా నడుస్తూ వెళ్తున్నాడు..చూస్తే అతడు ఆ డిస్నీల్యాండ్ ఉద్యోగిగా తెలుస్తోంది. ముందుగా ఆ వ్యక్తి నుండి ఉంగరాన్ని లాక్కొని, ఆపై వారిని డిస్నీల్యాండ్ ముందు ఉన్న మెట్లు దిగమని బలవంతం చేస్తాడు. అతను నిలబడి ఉన్న ప్రదేశంలో ప్రపోజ్ చేయకూడదని ఆ ఉద్యోగి సూచించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు ఆ జంటకు క్షమాపణ చెప్పారు డిస్నీల్యాండ్ ఉద్యోగి.
Disneyland Paris apologizes after employee ruins wedding proposal:
“We regret how this was handled. We have apologized to the couple involved and offered to make it right.” pic.twitter.com/J4hlnieVJ3
— Pop Crave (@PopCrave) June 4, 2022
కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సదరు ఉద్యోగిపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ జంట ఎలాంటి చెడ్డ పని చేయలేదని అంటున్నారు. అయినప్పటికీ డిస్నీల్యాండ్ ఉద్యోగులు వారి పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారని విమర్శిస్తున్నారు.