AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశమంతా ప్రేమ.. ఎత్తు అడ్డంకి కాదంటోంది..! ఈ జంట లవ్‌స్టోరీ తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో తరచుగా మనం ఏమనుకుంటామో దానికి పూర్తిగా భిన్నమైన వీడియోలు, కథనాలను చూస్తుంటాము. కొన్ని కథలు ప్రేమ, సంబంధాల గురించి కూడా ఉంటాయి. ఇవి ప్రేమలో లుక్స్, వయస్సు, ఎత్తు పట్టింపు లేదని రుజువు చేస్తాయి. ఈ రోజుల్లో అలాంటి ఒక కథ ఒక అమెరికన్ జంటకు సంబంధించి వైరల్ అవుతోంది. వారివురి మధ్యలో ఎత్తు తేడా చాలా ఎక్కువగా ఉంది. వారిని చూసిన ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పూర్తి స్టోరీలోకి వెళితే..

ఆకాశమంతా ప్రేమ.. ఎత్తు అడ్డంకి కాదంటోంది..! ఈ జంట లవ్‌స్టోరీ తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
Height Difference Couple
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2025 | 7:16 PM

Share

మనలో చాలా మంది వయసు అంతరం ఉన్న జంటలను చూశాము. కానీ, ఎత్తు తేడా ఉన్న కపుల్స్‌ చాలా తక్కువగా కనిపిస్తారు. కానీ, ప్రస్తుతం ఒక జంట విషయం ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఎందుకంటే.. ఆ జంట 4 అడుగుల పొడవున్న మహిళ 6 అడుగుల పొడవైన వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో ఈ జంటపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేధికగా నెటిజన్లు విస్తృతమైన ట్రోలింగ్‌ చేస్తున్నారు. చాలా మంది ఈ జంటను పిల్లతనంగా పిలుస్తున్నారు. ఇందుకు, ఆ మహిళ తగిన సమాధానంతో స్పందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఒక జంట పేరు టిఫనీ, ఆస్టిన్. వారు అమెరికాలో నివసిస్తున్నారు. టిఫనీ, ఆస్టిన్ ఎత్తులో చాలా తేడా ఉంది. టిఫనీ కేవలం 4 అడుగుల ఎత్తు మాత్రమే ఉండగా, ఆమె భర్త ఆస్టిన్ 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు. వైద్య పరిభాషలో టిఫనీని మరుగుజ్జుగా పరిగణిస్తారు. కానీ, ఆమె తనను తాను పొట్టి వ్యక్తి అని పిలుచుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ జంట ఒకరినొకరు 11 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ప్రజలు వారిని ఎగతాళి చేస్తున్నారు. ఆ వ్యక్తి ఒక చిన్నపిల్లతో డేటింగ్ చేస్తున్నాడని అంటున్నారు. కొందరు వారి వివాహాన్ని చట్టవిరుద్ధం అని కూడా అంటారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ జంట తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను సోషల్ మీడియాలో ప్రజలతో పంచుకుంటూనే ఉన్నారు.

ఒక వీడియోలో టిఫనీ తన శారీరక స్థితి సరిగా లేనప్పటికీ తాను ఏ ఇతర స్త్రీ కంటే భిన్నంగా లేనని చెబుతుంది. కాబట్టి, తాను సాధారణ ఎత్తు ఉన్న బిడ్డకు జన్మనివ్వగలనని వివరించింది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ప్రజలు చనిపోతారని, కానీ సరైన వైద్య తయారీ, శ్రద్ధతో, ఏదైనా సాధ్యమేనని ఆమె పేర్కొంది. ఇక వారి సంబంధం గురించి మాట్లాడుతూ.. టిఫనీ తాను పొడవైన పురుషులను ఇష్టపడతానని ఒప్పుకుంది. టిఫనీ చేతులు, కాళ్ళు తన భర్త కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇది తరచుగా ఆస్టిన్‌కు ఇబ్బందులను సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒక వైరల్ వీడియోలో ఆస్టిన్ తన నడుము వరకు మాత్రమే ఉన్న టిఫనీని ముద్దు పెట్టుకోవడానికి అతడు ఏం చేస్తాడో ఆమె చూపించింది. ఇదంతా ఆమె నవ్వుతూ వివరించింది. తన దైనందిన జీవితాన్ని సులభతరం చేయడానికి, ఆమె ఆస్టిన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ప్రతిచోటా స్టూల్స్ ఏర్పాటు చేసుకున్నానని చెప్పింది. తద్వారా ఆమె ఆస్టిన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పింది.

కాగా, వీడియో చూసిన ప్రజలు మాత్రం రకరకాలుగా స్పందించారు. కొందరు వారిని విమర్శిస్తూ కామెంట్స్‌ చేస్తుండగా, మరికొందరు వారిని ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..