Los Angeles Viral Video: ఒక్కసారిగా వందలాది మంది మార్టులోకి ప్రవేశించారు. వారంతా సరకులు కొనేందుకు వెళ్లారు.. అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే..? వారంతా దోపిడిదారులు.. ఒక్కసారిగా ప్రవేశించిన వారంతా షాపులోని సిబ్బందిని బెదిరించి వస్తువలన్నీ దోచుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 7-ఎలెవెన్ దుకాణంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
లాస్ ఏంజిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని 7-ఎలెవెన్ దుకాణాన్ని దోపిడీదారులు దోచుకున్నట్లు తెలిపారు. అయితే.. ఈ సంఘటనలలో పాల్గొన్న వారిని గుర్తించడానికి నగర ప్రజలు సహాయం చేయాలని పోలీసులు కోరడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు విడుదల చేసిన ఫుటేజీ ఈ వారం ప్రారంభంలో దుకాణంలో గందరగోళం నెలకొంది. డజన్ల కొద్దీ ప్రజలు 7-ఎలెవెన్‌లోకి పరుగులుతీశారు. అనంతరం దుకాణంలోని పానీయాలు, స్నాక్స్, సిగరెట్లు, లోట్టో టిక్కెట్లతో సహా అల్మారాల్లోని సరుకులను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
వైరల్ వీడియో..
WATCH: Police in Los Angeles have released footage showing a crowd ransacking a 7-Eleven and have asked for the public’s help identifying people involved.
The LAPD said they believed the “‘flash mob of looters” formed after a so-called street takeover. pic.twitter.com/vChMBOfP7Y
— Newsmax (@newsmax) August 19, 2022
చాలా మంది వ్యక్తులు కౌంటర్ మీదుగా వెళ్లి అక్కడ కూడా వస్తువులను పట్టుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో స్టోర్ క్లర్క్ ఒంటరిగా పని చేస్తున్నట్లు తెలిపారు. తాను ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నట్లు పోలీసులు చెప్పాడు. ప్రజలు నగదు కౌంటర్లను కూడా ధ్వంసం చేశారని.. వారు డబ్బు ఎత్తుకెళ్లారా..? లేదా అనే దానిపై స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. కాగా, ఫ్లాష్ మాబ్స్ ఒక్కోసారి నేర సంఘటనలుగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..