ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయాల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. మరోవైపు అవసరమైతేనే బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటర్ బాటిల్, గొడుగు తీసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే కొందరు రోడ్లపై చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనాల దప్పికను తీరుస్తున్నారు… కానీ ఓ బాలుడు మాత్రం ఏకంగా మండుటెండను ఏమాత్రం లెక్కచేయకుండా వీధివ్యాపారులకు సహయం చేస్తున్నారు. వీధి వ్యాపారులకు.. రోడ్డుపై ఉండేవారికి వాటర్ బాటిల్స్ ఇస్తూ సహయం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి అవనీష్ శరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా… అది వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు.. భూజాన కొన్ని వాటర్ బాటిల్స్ మోస్తూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ… వీధి వ్యాపారులకు బాటిల్స్ పంచుతున్నాడు. ఈ చిన్నారి నుంచి బాటిల్స్ తీసుకున్నవారు సంతోషంతో ఆ బాలుడిని ఆశ్వీర్వదిస్తుంచగా.. మరికొందరు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ చిన్నారి చేసిన సాయానికి నెటిజన్స్ ఫిదా అవుతూ.. గుడ్.. మానవత్వం ఇంకా బతికే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..
Your Small Kindness Can Make Someone’s Day Special.❤️ pic.twitter.com/ln8HYxqz9U
— Awanish Sharan (@AwanishSharan) May 1, 2022
Good , keep humanity alive
— Bhuriyawash, Ashok Kr Rajora (@RajoraAshok1) May 1, 2022
Wonderful teaching at this Age ?
— sridhar guptha (@nsridharguptha) May 1, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..
Degala Babji Movie: డేగల బాబ్జీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బండ్ల గణేష్ విడుదలయ్యేది అప్పుడే..
F3 Movie: ఈసారి సూపర్ హిట్ పక్కా.. ఎఫ్ 2 కి మించి ఉంటుంది.. ఎడిటర్ తమ్మిరాజు కామెంట్స్..