AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కృత్రిమ చేతిని పొందిన చిన్నారి.. మనసును కదిలిస్తున్న స్వచ్ఛమైన చిరునవ్వు.. అందమైన వీడియో మీకోసం..

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రజలను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. ఒక చిన్న పిల్లాడు తొలిసారి కృత్రిమ చేతిని పొందుతున్నట్లు ఆ వీడియోలో చూడొచ్చు.

Viral Video: కృత్రిమ చేతిని పొందిన చిన్నారి.. మనసును కదిలిస్తున్న స్వచ్ఛమైన చిరునవ్వు.. అందమైన వీడియో మీకోసం..
Boy
Shiva Prajapati
|

Updated on: Dec 03, 2021 | 5:50 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రజలను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. ఒక చిన్న పిల్లాడు తొలిసారి కృత్రిమ చేతిని పొందుతున్నట్లు ఆ వీడియోలో చూడొచ్చు. అయితే, కృత్రిమ చేతిని తొడుగుతున్న సందర్భంగా ఆ చిన్నారి స్పందన చూస్తే ఎంతటి కఠిన హృదయులైనా కరిగిపోవాల్సిందే. అతని స్వచ్ఛమైన చిరునవ్వుకు నెటిజన్లు సదా ఫిదా అయిపోతారు. ‘Nuristani365’ అనే పేరు గల వినియోగదారు ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక బాబు వీల్‌ఛైర్‌లో కూర్చొని.. తన విరిగిన చేయిని ముందుకు పెట్టాడు. డాక్టర్.. ఆ చిన్నారి విరిగిన చేయి కోసం ప్రొస్తెటిక్ చేయిని తీసుకొచ్చి అతికించడం ప్రారంభిస్తాడు. ఆ పిల్లవాడు డాక్టర్ చేస్తున్న పనిని నిశితంగా గమనిస్తున్నాడు. ప్రొస్తెటిక్ చేయిని సెట్ చేసిన తరువాత బాలుడు తన మరో చేత్తో ప్రొస్తెటిక్ చేయిని నిమురుతూ అనుభూతి చెందుతాడు. ఆ సందర్భంగా అతను చిరునవ్వులు చిందిస్తాడు. మొదట డాక్టర్ వైపు చూసి నవ్వి, ఆ తర్వాత తన పేరెంట్స్ వైపు చూసి మురిసిసోతాడు. ప్రొస్తెటిక్ చేయిని సెట్ చేసిన తరువాత దానిని మరో చేతితో టచ్ చేస్తూ ఆనందపడిపోతాడు. చాలా సంతోషంగా.. చిరునవ్వులు చిందిస్తాడు. ఆ నవ్వు చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. అంతటి స్వచ్ఛమైన నవ్వు ఆ సమయంలో ఆ చిన్నారి మొహంలో కనిపిస్తుంది. కాగా, ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇలా క్యాప్షన్ పెట్టాడు. “చాన్నారి తన మొదటి కృత్రిమ చేతిని పొందుతాడు. మాష్ అల్లాహ్.. అతను ఎంత సంతోషిస్తున్నాడో చూడండి. ఇలాంటి విషయాలను మనం సర్వసాధారణంగా తీసుకుంటాం.’’ అని పేర్కొన్నారు.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను 1.5 లక్షల మందికి పైగా వీక్షించగా.. 20వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ట్విట్టర్ యూజర్స్ ఈ వీడియోలో రకరకాలుగా స్పందిస్తున్నారు. చాన్నారిపై అమితమైన ప్రేమను కురిపిస్తున్నారు. అతని స్వచ్ఛమైన చిరునవ్వులకు నెటిజన్లంతా ఫిదా అయిపోతున్నారు.

Viral Video:

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!