సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సింహం, పులి, చిరుత, మొసలి వేటకు సంబంధించిన వీడియోలైతే మాములుగా ఉండవు. అవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. అలాగే అడవిలో జంతువులు చేసే చిత్ర, విచిత్ర విన్యాసాలకు హద్దు ఉండదు. అందుకేనేమో వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో అంత పాపులారిటీని సంపాదిస్తాయి.
ఇదిలా ఉంటే ప్రాంతాల మీద ఆధిపత్యం చలాయించేందుకు మనుషులు కొట్టుకుంటుంటే .. ఎర కోసం జంతువులు కొట్టుకుంటాయి. తరచూ సమఉజ్జీలైన జంతువుల మధ్య ఈ ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. తాజాగా మొసలి, సింహం మధ్య ఇలాంటి పోరు ఒకటి జరిగింది. ఇద్దరూ సమఉజ్జీలే.. కాబట్టి పోరు మాములుగా ఉండదు. బాహుబలి, భల్లాలదేవుడు తలపడ్డట్లే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సముద్రపు ఒడ్డున పడి ఉన్న అడవి పంది కళేబరం కోసం ఒకవైపు సింహం.. మరోవైపు మొసలి భీకర పోరుకు సిద్దమయ్యాయి. మొసలి తన దవడలతో ఆ కళేబరాన్ని ఒకవైపు గట్టిగా పట్టుకోగా.. దాన్ని దక్కించుకునేందుకు మృగరాజు భీకరంగా పోరాడాడు. అయితే చివరికి మొసలి పట్టు ముందు సింహం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆ ఎరపై తన పట్టును విడిచిపెట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Also Read:
వధువు పెళ్లి డ్రెస్‌లో దాక్కున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో!
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే
పెళ్ళి భోజనం లాగిస్తోన్న అమ్మాయి.. అంతలోనే బ్రేక్.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!
సింహాల గుంపుతో గేదె పోరాటం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే.! వైరల్ వీడియో