సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన ప్రమాదకర వీడియోస్ వైరల్ అవతుంటాయి. ఒక జీవి ఆకలికి మరో ప్రాణి బలి కావాల్సిందే. తమ ఆకలి తీర్చుకోవడానికి ఇతర జంతువులను వేటాడుతుంటాయి. సింహాలు, చిరుతలు, పులులు, తోడేళ్లు ఇలా అనేక రకాల జంతువులు ఇతర జంతువుల ప్రాణాలు తీస్తుంటాయి. వాటి వేటకు సంబంధించిన వీడియోస్ మనం రెగ్యులర్ గా చూస్తుంటాము. అలాంటి ప్రమాదకరమైన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో చూస్తే రొమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇంతకీ ఏం జరిగింది అని చూస్తున్నారా ? ఎద్దుకు, చిరుతకు జరిగిన పోరాటం.. చివరకు భారీ శరీరమున్న ఎద్దు చిరుతకు ఆకలికి బలయ్యింది.
ఆ వీడియోలో రోడ్డు పక్కనే ఓ ఎద్దుపై చిరుతపులి దాడి చేసింది. ఎద్దు మెడను తన నోటితో గట్టిగా పట్టేసింది. రోడ్డుపై ఎద్దు ఉండంగా.. రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్ కింది నుంచి దాని మెడను పట్టుకుంది. చిరుత నుంచి విడిపించుకునేందుకు ఎద్దు తెగ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ప్రాణాలు వదిలింది. దీంతో వెంటనే ఎద్దును రోడ్డు పక్కకు లాక్కెల్లి పోయింది చిరుత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో తీయకుండా ఆవు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం ఎందుకు చేయలేదంటూ ఫైర్ అవుతున్నారు. ఆ వీడియోను మీరు చూడండి.
ట్వీట్..
On display, the tremendous jaw strength of Leopard !!@susantananda3 @surenmehra @SudhaRamenIFS @PraveenIFShere pic.twitter.com/XWdG9tJz9F
— SAKET (@Saket_Badola) August 15, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.