Leopard: ఇదేంట్రా బాబు సరాసరి ఇంట్లోకే వచ్చేసింది.. హైదరాబాద్‌ శివారులో చిరుత సంచారం.. భయం, భయం!

సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. కల్హేర్ మండలంలోని బీబీపేట్ గ్రామంలో శనివారం ఉదయం స్థానికులకు చిరుతపులి కనిపించింది. స్థానిక మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లో చిరుత చూసిన జనాలు ఒక్కసారిగ భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన చిరుత దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leopard: ఇదేంట్రా బాబు సరాసరి ఇంట్లోకే వచ్చేసింది.. హైదరాబాద్‌ శివారులో చిరుత సంచారం.. భయం, భయం!
Leopard

Updated on: Jun 14, 2025 | 5:30 PM

సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కల్హేర్ మండలంలోని బీబీపేట్ గ్రామంలో స్థానికులకు చిరుతపులి కనిపించింది. అయితే, స్థానిక మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లోకి శనివారం ఉదయం ఓ చిరుత చొరబడింది. ఈ చిరుత వారి కంపౌండ్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఇంట్లో చిరుతపులిని చూసి గండు మోహన్ కుటుంబ సభ్యలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసి ఇంటికి తాళం వేశారు.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక ఇంట్లోని కంపౌండ్‌వాల్‌లో ఉన్న చిరుతను తరిమేందుకు గట్టిగా శబ్ధాలు చేశారు. ఒక్కసారిగా ఎక్కువ మంది జనాన్ని చూసి భయపడిపోయిన చిరుత వెంటనే అక్కడి నుంచి పారిపోయింది.

వైరల్‌ వీడియో చూడండి..


అయితే గ్రామంలో చిరుత సంచారాన్ని కళ్లార చూసిన స్థానికుల గుండెల్లో భయం చేరుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకొని తమను కాపాడాలని అటవీశాఖ అధికారులును కోరుతున్నారు స్థానికులు. బాధితుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..