Telugu News Trending Leopard attack on People video gone viral in social media Trending news
Video Viral: ఏకంగా ఊరు మొత్తాన్నే వణికించేసింది.. అడ్డొచ్చిన వారందరిపై ఎటాక్ చేస్తూ..
అడవిలో వివిధ రకాల జంతువులు నివాసముంటాయి. వాటిలో ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి కొన్ని జంతువులు మాత్రమే ఉంటాయి. వీటిలో సింహాలు, పులులు, చిరుతలు వంటివి క్రూర జంతువులు. వీటికి చిక్కితే ఎవరైనా సరే తప్పించుకోవడం...
అడవిలో వివిధ రకాల జంతువులు నివాసముంటాయి. వాటిలో ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి కొన్ని జంతువులు మాత్రమే ఉంటాయి. వీటిలో సింహాలు, పులులు, చిరుతలు వంటివి క్రూర జంతువులు. వీటికి చిక్కితే ఎవరైనా సరే తప్పించుకోవడం కష్టం. వేట, వేగం విషయాల్లో చిరుతపులులతో ఏ జంతువూ పోటీ పడలేదు. ఇలాంటి జంతువులు అడవుల్లోనే నివాసముంటున్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు అవి జనావాసాల్లోకి వస్తుంటాయి. అంతే కాకుండా జనాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో ఓ చిరుత దారి తప్పి గ్రామంలోకి వస్తుంది. దానిని చూసి భయపడిపోతున్న గ్రామస్థులపై దాడి చేస్తుంది. చిరుత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి గోడ ఎక్కుతున్న సమయంలో అతనిపై దాడి చేసి అక్కడి నుంచి ఉడాయిస్తుంది. ఆ తర్వాత మరొక వ్యక్తిపై దాడి చేస్తుంది. ఇలా చాలా మందిపై చిరుత దాడి చేస్తుంది. అయితే ఆ దాడిలో ఎవరూ గాయపడకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ 35 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 64 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘మీరు వేగవంతమైన రన్నర్‌గా ఉండాల్సిన అవసరం లేదని ఇది చూపిస్తుంది, నెమ్మదిగా ఉండకండి’ అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.