జనావాసాల్లో అడవి జంతువులు, క్రూరమృగాల సంచారం ఎక్కువైంది. ఇటీవల తరచూ ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. గతంలో గుజరాత్‌కు చెందిన ఒక వీడియోలో అర్థరాత్రి సింహాల గుంపు గ్రామంలో సంచరిస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. కాగా, ఇక్కడ అలాంటిదే ఒక వీడియో నెటిజన్లను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇక్కడ కనిపించిన వీడియోలో ఒక చిరుత పులి పట్టపగలేఊళ్లోకి వచ్చేసింది. పులిని గమనించిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్ దాన్ని ధైర్యంగా ఎదురించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
శ్రీనగర్ లోని గండేర్‌బల్‌లో బుధవారం ఓ చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుతపులి ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి శాఖ అధికారులపై దాడి చేసింది. చిరుత దాడిలో గాయపడిన వారందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఊర్లోకి వచ్చిన చిరుత ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేస్తుండగా..అధికారులు దాన్ని ఎలాగోలా అడ్డుకుని పట్టుకున్నారు.
Brave man. Leopard Caught alive at Fetehpora village in Ganderbal District of Central Kashmir. Leopard was roaming in the village and had created panic.#Kashmir #ganderbal#srinagar pic.twitter.com/pUNUozm7UB
— ASIF IQBAL BHAT (@asifiqbalbhat53) April 3, 2024
అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..