అద్దె ఇళ్లు ఖాళీ చేసిన వ్యక్తి.. విలువైన బహుమతి ఇచ్చి పంపిన ఓనర్! అసలు మ్యాటరేంటంటే..?
బెంగళూరులోని ఒక అద్దె ఇంటి యజమాని తన ఇంటిని ఖాళీ చేస్తున్న అద్దెదారుకు వెండి కడియం బహుమతిగా ఇచ్చారు. రెడ్డిట్‌లో ఈ విషయాన్ని అద్దెదారు పంచుకున్నారు. రెండేళ్ల పాటు అద్దెకు ఉండి, యజమానితో మంచి బంధం ఏర్పరచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

సాధారణంగా ఎవరైనా ఓ ఇంట్లో అద్దెకు ఉంటే.. ఓనర్లతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఆ ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తే.. తమను ఇంత కాలం ఇంట్లో ఉండనిచ్చినందుకు, తమను మంచిగా చూసుకున్నందుకు, ఎప్పుడైనా రెంట్ ఇవ్వడం లేట్ అయినా ఇబ్బంది పెట్టనందుకు వారికి థ్యాంక్స్ చెప్పి వెళ్తారు. కొన్నేళ్లపాటు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటే.. ఆ ఇంటి యాజమానులతో ఒక అనుబంధం ఏర్పడుతుంది. కానీ, మరీ విలువైన బహుమతులు ఇచ్చేంత బంధం అయితే కష్టమే. కానీ, అది జరిగింది. బెంగళూరుకు చెందిన ఒక ఇంటి యజమాని.. ఇంత కాలం తన ఇంట్లో అద్దెకు ఉండి వెళ్లిపోతున్న ఓ వ్యక్తికి వెండి కడియం బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ బహుమతి స్వీకరించిన వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు, ఓనర్ అత్యంత ప్రేమతో అతనికి వెండి బ్రాస్లెట్ బహుమతిగా ఇచ్చి, తాను మంచి మనసున్న వ్యక్తి అని చెప్పి వీడ్కోలు పలికాడని రెడ్డిట్ ఖాతాలో షేర్ చేశాడు. @Kind_Transition_7885/Reddit అద్దె ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి యజమాని ఇచ్చిన ప్రేమపూర్వక వీడ్కోలు బహుమతి గురించి Redditలో రాశారు. ఇంటి యజమానులు డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వని నగరంలో నా ఇంటి యజమాని నాకు వీడ్కోలు బహుమతి ఇచ్చారు.
నేను రెండు సంవత్సరాలు ఒకే ఇంట్లో నివసించాను. ఇంటి యజమాని తన బస అంతా నన్ను కొడుకులా చూసుకున్నారు. నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి యజమాని నుండి వీడ్కోలు బహుమతిగా వెండి బ్రాస్లెట్ అందుకున్నాను. అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఎప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోతారా? అద్దె పెంచి వేరే వాళ్లకు ఇవ్వొచ్చు అని చూసే ఓనర్లు ఉన్న ఈ కాలంలో ఇలాంటి ఓనర్ ఉండటం నిజంగా గొప్ప విషయమే అని నెటిజన్లు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
