కొమొడో డ్రాగన్ పేరు వినే ఉంటారుగా.. ఇది భూమ్మీద జీవించే బల్లి జాతికి చెందిన భయంకరమైన అతి పెద్ద జంతువు. ఇది దాదాపు 90 కేజీల బరువు వరకూ పెరుగుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విషపు జంతువు. దీని నోటిలో షార్క్ చేపకు ఉన్నట్లు పదునైన పళ్లు కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఓ కొమొడో డ్రాగన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అది ఒక తాబేలుపై అటాక్ చేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొమొడో డ్రాగన్ బీచ్‌లో నడుస్తూ వెళ్తుంది. అక్కడ దానికి ఓ పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే దానిపై ఎటాక్ చేసింది. తాబేలు భయంతో దాని రక్షణ కవచం డొప్పలోకి చొచ్చుకుపోయినా వదల్లేదు. డ్రాగన్ తన తలను తాబేలు డొప్పలోకి దూర్చి లోపలే దాన్ని ఆహారంగా చేసుకుంది. ఈ క్రమంలో తాబేలు డొప్పను డ్రాగన్ తలకు హెల్మెట్‌లా తగిలించుకుని తన రాజసాన్ని ప్రకటిస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్లింది. కర్పరంలోని మాంసాన్ని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత ఒక్కసారిగా తలను విదిలించి దాన్నుంచి బయటికి వచ్చింది.
2019లో తీసిన ఈ పాత వీడియోను ఫాస్కినేటింగ్ అనే పేరుగల ఓ ట్విట్టర్ యూజర్ మరోసారి పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తాబేలు కర్పరాన్ని తలకు హెల్మెట్‌లా తగిలించుకుని కనిపించిన ఈ కొమొడోడ్రాగన్.. నెటిజన్‌ల దృష్టిని బాగా ఆకర్షించింది. ఇప్పటికే ఈ వీడియోకు లక్షలాదికి పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే వేలాది లైకులు వచ్చాయి. మరి నెటిజన్లను భయపెట్టిస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
A komodo dragon ate a turtle and then wore it like a hat. Original video: https://t.co/HfyCM0qT3Y pic.twitter.com/dTQjPi0F9I
— Fascinating (@fasc1nate) October 17, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..