అడవిగా మారిన ఒకే ఒక్క చెట్టు..! ఇప్పుడు ఓ నగరాన్నే మింగేయబోతోంది…? ఆ అద్భుతాన్ని చూడాల్సిందే…

ఒక చెట్టు అడవిగా మారగలదా? ఒకే ఒక్క చెట్టుతో ఏర్పడిన అడవిని మీరు ఎప్పుడైనా చూశారా? అవును నిజంగానే అలాంటి ఒక చెట్టు ఉంది. ఇది మొత్తం నగరాన్ని కప్పేసిన అతిపెద్ద చెట్టును చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఇప్పటి వరకు మీరు అనేక రకాల అడవులను చూసి ఉంటారు. కానీ, ఒకే చెట్టు ఉన్న అడవిని ఎప్పుడైనా చూశారా..? మీ సమాధానం లేదు అయితే, ఈ వార్త మీ కోసమే.

అడవిగా మారిన ఒకే ఒక్క చెట్టు..! ఇప్పుడు ఓ నగరాన్నే మింగేయబోతోంది...? ఆ అద్భుతాన్ని చూడాల్సిందే...
Worlds Largest Cashew Tree

Updated on: Nov 18, 2025 | 4:52 PM

ఒక చెట్టు పెద్దగా పెరిగి మొత్తం అడవిగా మారిందని ఎవరైనా చెబితే అది హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ అది వాస్తవానికి బ్రెజిల్‌లో జరిగింది. ఒక చెట్టు ఎంతగా వ్యాపించిందంటే.. అది 20 ఎకరాల భూమిని దాని నీడతో కప్పేసింది… దాని కింద ఒక పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం కూడా కనిపించకుండా పోయింది. ఇది మన చుట్టూ ఉన్న ప్రకృతి చేసే మాయాజాలం అనిపిస్తుంది. ఇలాంటివి కొన్ని సార్లు మానవ అవగాహనకు మించిన అద్భుతాలను చూపిస్తాయి. బ్రెజిలియన్ రాష్ట్రమైన రియో ​​గ్రాండే డో నోర్టేలో ఉన్న కాజుయిరో డా ప్రియా అనేది ఒక భారీ జీడిపప్పు చెట్టు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను కలిగి ఉంది. 1888లో ఒక జాలరి రెండు జీడిపప్పు చెట్లను ఇక్కడ నాటాడు. ఆ చెట్లలో ఒకటి పెరిగి ఇప్పుడు ఒక అడవిగా మారింది. నేడు ఆ చెట్టు 8.5 హెక్టార్లు (85,000 చదరపు మీటర్లు) విస్తరించి ఉంది. అంటే ఒక చెట్టు 20 ఎకరాల పచ్చదనానికి సమానం.

ప్రపంచంలోనే అతిపెద్ద జీడిపప్పు చెట్టు ఎలా మనుగడ సాగిస్తుంది?

ఇవి కూడా చదవండి

సాధారణంగా చెట్ల కొమ్మలు నేలను తాకుతూ వంగిపోతే, అవి వెంటనే విరిగిపోతాయి. కానీ, ఈ చెట్టు అరుదైన జన్యు పరివర్తనను కలిగి ఉంటుంది. దాని కొమ్మలు నేలను తాకినప్పుడు అక్కడి నుండి కొత్త వేర్లు మొలకెత్తుతాయి. ఆ భాగం కొత్త కాండం అవుతుంది. నెమ్మదిగా అది మరో చెట్టుగా పెరుగుతుంది. చుట్టూ వ్యాపిస్తుంది. ప్రతి సంవత్సరం 6–8 మీటర్ల భూభాగాన్ని తన నీడలోకి కలుపుతుంది. నేడు ఇది 5,000 కంటే ఎక్కువ కాండాలు, 8 మిలియన్ ఆకులను కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం 80,000 జీడిపప్పులను (2.5 టన్నులు) ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ చెట్టు ఒక పర్యాటక ప్రదేశంగా మారింది. దాని నీడలో ఏకంగా 7000 మందికి వసతి కల్పించగలదు.

స్థానికులు దీనిని సోమరితనానికి కేరాఫ్‌ అని కూడా పిలుస్తారు..ఎందుకంటే దాని నీడ చాలా చల్లగా, ఎండ తగలకుండా చీకటిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ పడుకుంటే, ఇక లేవాలని అనిపించదు. ఇది అనేక రెస్టారెంట్లు, వాకింగ్‌ ట్రాక్‌లు, గిఫ్ట్‌ షాప్స్‌, వ్యూస్‌ పాయింట్స్‌గా కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం 1 మిలియన్ కంటే ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. పై నుండి చూస్తే ఆ ప్రాంతం మొత్తం ఆకుపచ్చ సముద్రాన్ని పోలి ఉంటుంది. ఇది ఎంతో సుందరమైన, అద్భుతమైన దృశ్యం. కానీ, ఒక ప్రమాదం కూడా ఉంది. అది మొత్తం నగరాన్ని మింగేస్తుందని అంటున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ చెట్టు వేగంగా పెరుగుతూ, కొమ్మలతో వ్యాపిస్తూ దాని మూలాలు రోడ్లు, భవనాలను దెబ్బతీసింది. దీని వేగాన్ని ఆపకపోతే, 50 సంవత్సరాలలోపు ఇది మొత్తం నాటల్ నగరాన్ని కవర్ చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు దీనిని ఇప్పటికీ ప్రకృతి ఎనిమిదవ అద్భుతం అని పిలుస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..