Viral News: అన్న మాటంటే మాటే.. ఎన్నికల్లో పార్టీ ఓడిందని.. మీసం తీసేసిన కార్యకర్త..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరు మామూలుగా ఉండదు. బరిలో ఉండే అభ్యర్థులు ఒకరికి మించి మరొకరు గెలుపుపై ధీమాలు వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలోనే కొందరు శపథాలు కూడా చేస్తారు. తీరా కొన్ని అదేవారికి బెడిసికొడుతుంది. తాజాగా అలాంటి ఘటనే కేరళలో వెలుగు చూసింది. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఓ కార్యకర్తల ఇచ్చిన మాట ప్రకారం మీసాలు తీయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మాంది.

Viral News: అన్న మాటంటే మాటే.. ఎన్నికల్లో పార్టీ ఓడిందని.. మీసం తీసేసిన కార్యకర్త..
Election Mustache

Updated on: Dec 15, 2025 | 3:43 PM

ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీనే గెలుస్తుందనే ధీమాతో శఫథం చేసి ఓ కార్యకర్తకు ఊహించని పరిణామం ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతని పార్టీ ఓడిపోయింది. దీంతో చేసేదేమి లేక అతను ఇచ్చిన మాట ప్రకరాం.. మీసాలు తీయించుకున్నాడు. ఇందు సంబంధించిన వీడియో ప్రస్తతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయితే LDF పార్టీ కార్యకర్త అయిన బాబు వర్గీస్ అనే వ్యక్తి ఈ ఎన్నికల్లో తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసాడు. ఒకవేళ తమ పార్టీ గెలవకపోతే తన మీసాలు తీయించుకుంటానని ఛాలెంజ్ చేసాడు.

అయితే ఎవరూ ఊహించని విధంగా అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని పోటీ చేసిన UDF పార్టీ LDF పై ఘన విజయం సాధించింది. శనివారం వెలువడిన ఫలితాలు, పతనంతిట్ట మునిసిపాలిటీలోనే కాకుండా, జిల్లా అంతటా LDF కు పెద్ద షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (UDF) జిల్లాలోని పతనంతిట్ట, తిరువళ్ళ, పండలం సహా నాలుగు మునిసిపాలిటీలలో మూడింటిని గెలుచుకుంది.

ఇక ప్రచారం సమయంలో తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే స్నేహితులతో కలిసి మీసాలు కత్తిరించుకుంటానని పందెం వేసిన వర్గీస్.. ఇచ్చిన మాట ప్రకారం.. సెలూన్ కు వెళ్లి మీసాలు తీయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.