
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చైత్ర అనే మహిళకు గజేంద్రతో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 8, 10 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. అయితే, చైత్ర గతంలో పునీత్ అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్టుగా పోలీసులు విచారణలో తెలిసింది. కానీ, కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించారు. అయితే, గత ఏడాది కాలంగా ఆమె శివ అనే మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని తిరిగి ప్రారంభించిందని తెలిసింది.
ఈ క్రమంలోనే ప్రియుడితో వివాహేతర సంబంధం కోసం తన భర్త, పిల్లలు, అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. వారికి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది. భోజనం తరువాత వారంతా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటినా వారిని ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు మొదట్లో ఫుడ్ పాయిజనింగ్‌గా అనుమానించారు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె భర్త గజేంద్ర బేలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైత్ర ఉద్దేశపూర్వకంగా ఆహారంలో విషంతో కలిపిందని నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తనదైన స్టైల్లో విచారించగా, అసలు వాస్తవం తెలిసింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శివుడి కోసం గాలింపు చేపట్టారు.
అయితే, అదృష్టవశాత్తు పిల్లలు, అత్తమామ అందరూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వారందరూ ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…