Fishing: చేపల కోసం నదిలో వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి షాక్..!

|

Aug 10, 2024 | 4:15 PM

నదుల్లో నీటిమట్టం పెరగడం వల్ల మత్స్యకారులకు చేపల పంట పండుతోంది. ఈ క్రమంలోనే చేపల వేటకు వెళ్లిన కొందరు నదిలో వల విసిరారు.. ఊహించని విధంగా వారి ఒక్కసారిగా బరువెక్కింది. పెద్దమొత్తంలో చేపలు చిక్కాయని భావించిన మత్స్యకారులు జాగ్రత్తగా వలను ఒడ్డుకు లాగారు. కానీ, వలలో చేపలకు బదులు 7 అడుగుల కొండచిలువ చిక్కింది. దాంతో, మత్స్యకార యువకులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

Fishing: చేపల కోసం నదిలో వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి షాక్..!
Fishing Snake
Follow us on

నాగుల పంచమి రోజు మనం పాములను పూజిస్తాము. రైతులు వాటికి కృతజ్ఞతగా పూజలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ పాములు పంట పొలంలో ఎలుకలను తింటూ రైతుకు సహాయం చేస్తాయి.. అయితే ఈ నాగ పంచమి నాడు ఓ పెద్ద పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మత్స్యకారుడు చేపల కోసం వలను విసరగా, అందులో ఊహించని విధంగా పెద్ద కొండచిలువ పాము చిక్కింది. దాని భారీ సైజును చూసిన మత్స్యకారులు, స్థానిక గ్రామస్తులు భయపడకపోగా, ఆపదలో ఉన్న ఆ పామును ఆదుకుని సపర్యాలు చేసి దాని ప్రాణాలు కాపాడారు. గ్రామస్తులు ఆ కొండచిలువ ప్రాణాలను కాపాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా కర్ణాటకలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలతో పాటు నదులు కూడా ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. నదుల్లో నీటిమట్టం పెరగడం వల్ల మత్స్యకారులకు చేపల పంట పండుతోంది. ఈ క్రమంలోనే చేపల వేటకు వెళ్లిన కొందరు నదిలో వల విసిరారు.. ఊహించని విధంగా వారి ఒక్కసారిగా బరువెక్కింది. పెద్దమొత్తంలో చేపలు చిక్కాయని భావించిన మత్స్యకారులు జాగ్రత్తగా వలను ఒడ్డుకు లాగారు. కానీ, వలలో చేపలకు బదులు 7 అడుగుల కొండచిలువ చిక్కింది. దాంతో, మత్స్యకార యువకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత వారు ఏం చేశారు.? ఈ కొండచిలువ ఏమైందో చూడండి.

ఇవి కూడా చదవండి

వలలో చిక్కిన కొండచిలువను చూసిన మత్స్యకార యువకులు, గ్రామస్తులు, స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. నిమిషాల్లో స్నేక్ ఎక్స్‌పర్ట్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వలలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న కొండచిలువను చూసిన స్నేక్‌ క్యాచర్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. వెంటనే అతికష్టం మీద దాన్ని బయటకు తీసే ప్రయత్నం మొదలుపెట్టాడు. దాదాపు అరగంట పాటు ప్రయత్నించి కొండచిలువను బయటకు తీయగలిగాడు.
ఈ వీడియో ajay_v_giri Instagram అనే ఖాతాద్వారా షేర్‌ చేశారు. ఈ కొండచిలువను కాపాడేందుకు వచ్చిన స్నేక్‌ క్యాచర్స్‌ కర్ణాటక అటవీ శాఖ ఉద్యోగులుగా తెలిసింది. ప్రస్తుతం వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన ప్రజలు గ్రామస్తులను అభినందించారు. ఎందుకంటే సాధారణంగా కొండచిలువ కనిపిస్తే చాలు భయంతో పరుగులు తీస్తుంటారు. కానీ, ఇక్కడి ప్రజలు ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్న కొండచిలువను రక్షించే ప్రయత్నం చేసినందుకు నెటిజన్లు ప్రశంసించారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ..నాగుల పంచమి నాడు పామును చూడటం శుభప్రదం అని, ఇక్కడి గ్రామస్తులందరూ స్వర్గానికి వెళతారంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..