Watch: విమానంలో ప్రయాణికురాలికి అస్వస్థత.. సీపీఆర్‌ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

గోవా-ఢిల్లీ ఇండిగో విమానంలో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురికాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న కాన్పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ అంజలి నింబాల్కర్ వెంటనే స్పందించి సీపీఆర్‌ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. సకాలంలో వైద్య సహాయం అందించి ప్రాణదాతగా నిలిచిన అంజలి నింబాల్కర్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశంసించారు. ఈ సంఘటన మానవత్వం, వైద్య నైపుణ్యాన్ని చాటింది.

Watch: విమానంలో ప్రయాణికురాలికి అస్వస్థత.. సీపీఆర్‌ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Former Mla Nimbalkar Saves

Updated on: Dec 14, 2025 | 4:50 PM

విమానం గాల్లో ఎగురుతుండగా, ఒక ప్రయాణికురాలికి అత్యవసర పరిస్థితి ఎదురైంది. గోవా-న్యూఢిల్లీ విమానంలో ప్రయాణీకురాలికి అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తడంతో విమానంలో భయాందోళనలు చెలరేగాయి. విమానంలో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన ఒక వైద్యుడు వెంటనే స్పందించారు. సకాలంలో వైద్య సహాయం చేయడంతో ఆ ప్రయాణీకురాలిని బతికించారు. విమానం ల్యాండ్‌ అయిన వెంటనే బాధితురాలిని తదుపరి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే ప్రయాణికురాలు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. శనివారం మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో గోవా నుండి ఇండిగో విమానం బయలుదేరింది. ఆ తరువాత 10 నిమిషాల్లోనే కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే 34 ఏళ్ల ప్రయాణికురాలు తీవ్ర అసౌకర్, వణుకుతో కుప్పకూలిపోయారు. ఆమె తన సోదరితో కలిసి 16వ వరుసలో కూర్చుని ఉన్నారు. ఒక వివాహానికి హాజరు కావడానికి వారిద్దరూ ఢిల్లీకి ప్రయాణిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

జెన్నీ కుప్పకూలటంతో విమానంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అంతలోనే అదే విమానంలో ప్రయాణిస్తున్న కాన్పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ అంజలి నింబాల్కర్‌ వెంటనే స్పందించారు… జెన్నీకి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయిన తర్వాత జెన్నీని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డాక్టర్‌ అంజలి నింబాల్కర్‌ను ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..