”ఒక చిత్రం వెయ్యి విషయాలతో సమానం. కానీ ఓకే చిత్రంతో వేల కథలు అల్లడం సరికాదు. ఏ కథనైనా, చిత్రానైనా షేర్ చేసే ముందు అది సరైనదో కాదో తెలుసుకోండి” ఇది మేము అనే మాట కాదండీ.. సోషల్ మీడియా వినియోగించే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని సూత్రం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజాగా అలాంటి ఓ ఫేక్ వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న ఫోటోలో రెండు విషయాలను మీరు గమనించవచ్చు. ఒకవైపు కొంతమంది పిల్లలు బురదతో కూరుకుపోయిన రోడ్డుపై వెళ్తుంటే.. మరోవైపు ఓ పిల్ల తన స్కూల్ బ్యాగ్ సహాయంతో గోడ పట్టుకున్నట్లు మీరు చూడవచ్చు. ఇక ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పిల్లల దుస్థితి అని పేర్కొంటూ… ఓ రాజకీయ నేత ‘పిల్లలు ‘అమ్మవడి’ నుండి బడిబాట పోవాలంటే రాచబాట కావాలి కదా సార్’ అని క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక కొన్ని క్షణాల్లోనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం.
ఒక చిత్రం వేయి విషయాలతో సమానం. కానీ ఓకే చిత్రంతో వేల కథలు అల్లడం సరికాదు. ఏ కథనైనా, చిత్రానైనా షేర్ చేసేముందు అది సరైనదో కాదో తెలుసుకోండి..
అది తెలుసుకోకుండా షేర్ చేసే వారితో తస్మాత్ జాగ్రత్త. pic.twitter.com/ndLtYUJLx8
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) November 11, 2021
అయితే ఈలోపే ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ వింగ్ క్లారిటీ ఇచ్చింది.. అది కేవలం ఓ ఫేక్ వార్త అని స్పష్టం చేసి.. దానికి తగిన సాక్ష్యాలను జత చేసి.. ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ”ఒక చిత్రంతో వేల కథలు అల్లడం సరికాదని.. ఏ కథనైనా, చిత్రానైనా షేర్ చేసేముందు అది సరైనదో కాదో తెలుసుకోవాలని’ పేర్కొంది. అది తెలుసుకోకుండా షేర్ చేసేవారితో తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలకు సూచనలు ఇచ్చింది.
Also Read:
3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?
Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!
Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్షన్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!
Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!