Video: ఓరేయ్ నువ్వు మనిషివేనా.. కారుతో ఢీ కొట్టి, ఆపై బేసిక్ సెన్స్ లేకుండా.. వీడియో చూస్తే మీరూ తిట్టేస్తారు..!
Humanity vs Materialism: భౌతిక సంపదపై ఉన్న వ్యామోహం మనుషులను ఎంతలా దిగజారుస్తుందో ఈ ఘటన నిరూపించింది. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడైనా, ఎవరికైనా జరగవచ్చు.. కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడటం కంటే సొంత ఆస్తి నష్టాన్ని లెక్కచూసుకోవడం మృగత్వానికి పరాకాష్ట. ఇప్పటికైనా చట్టాలు కఠినంగా వ్యవహరించి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Car Accident Video: నడిబొడ్డున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలను కుదిపేస్తోంది. కంటిముందు ఓ ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే, కాపాడటం మాని తన విలాసవంతమైన కారుకు తగిలిన దెబ్బలను లెక్కేసుకున్న ఓ మానవత్వం లేని మనిషి నిర్వాకంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కార్..
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జూన్ 7వ తేదీన ఈ ఒళ్ళు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఒక రద్దీ రహదారి పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై ఒక వ్యక్తి సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే ఊహించని విధంగా ఒక సిల్వర్ కలర్ బీఎండబ్ల్యూ (BMW) కారు అతివేగంతో నియంత్రణ కోల్పోయింది. రోడ్డును వదిలి ఒక్కసారిగా ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చి, అక్కడ నడుస్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి సదరు ప్యాసింజర్ గాల్లోకి ఎగిరి కిందపడగా, కారు అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టును బలంగా ఢీకొని ఆగింది. ప్రమాద ధాటికి కారు విడిభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఇది కూడా చదవండి: Video: ఓపికను టెస్ట్ చేస్తే ఇలాగే ఉంటది.. బుడ్డోడి దూల తీరిపోయిందిగా.. ఇదిగో వీడియో
ప్రాణం కంటే కారే ఎక్కువైందా..?
İstanbul’da kaldırımda yürüyen bir kişiye otomobil çarptı.
Sürücü, kazanın ardından araçtan inerek otomobilini kontrol etti. https://t.co/orXYUkwTUM
— Pusholder (@pusholder) June 8, 2026
ఈ ప్రమాదంలో కాలినడకన వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో పడిపోయాడు. ఇలాంటి సమయంలో ఏ సామాన్య మనిషైనా ఏం చేస్తాడు? వెంటనే కారు దిగి బాధితుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడే ఆ డ్రైవర్ లోని రాక్షసత్వం బయటపడింది. కారులోంచి కిందకు దిగిన ఆ వ్యక్తి, కనీసం మానవత్వం లేకుండా.. కిందపడి ప్రాణాలకై కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని అస్సలు పట్టించుకోలేదు. నేరుగా తన కారు ముందు భాగానికి వెళ్ళి, ఎక్కడెక్కడ స్క్రాచెస్ పడ్డాయి, ఎంత డ్యామేజ్ అయ్యింది అంటూ చాలా కూల్‌గా పరిశీలించడం మొదలుపెట్టాడు.
అండగా నిలిచిన స్థానికులు.. రంగంలోకి పోలీసులు..
డ్రైవర్ ప్రవర్తన అక్కడున్న వారిని సైతం షాక్‌కు గురిచేసింది. కారు నడిపిన వ్యక్తి పట్టించుకోకపోయినా, రోడ్డుపై వెళ్తున్న స్థానికులు, వ్యాపారులు మానవత్వంతో స్పందించారు. వెంటనే పరుగున వచ్చి బాధితుడికి ప్రాథమిక సాయం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇస్తాంబుల్ పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నెట్టింట వెల్లువెత్తుతున్న ప్రజా ఆగ్రహం..
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియా వేదికలపైకి రావడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారింది. కోట్లాది మంది ఈ వీడియోను చూసి సదరు బీఎండబ్ల్యూ డ్రైవర్‌పై శాపనార్థాలు పెడుతున్నారు. “డబ్బు, లగ్జరీ కార్లు మనుషుల్లోని కనీస మానవత్వాన్ని చంపేస్తున్నాయనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి అహంకారికి కఠినమైన శిక్ష పడాలని, లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా జైల్లో పెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




