Viral Video: వామ్మో.. ఈ రోడ్డులో యుముడు రెడీగా ఉన్నాడు.. నెట్టింట షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..

|

Jul 07, 2022 | 6:02 PM

సాధారణంగా యాక్సిడెంట్ అనుకోకుండా జరుగుతుంది. కానీ.. ఈ రోడ్డులో ప్రయాణించే వాహనాలన్నీ యాక్సిడెంట్‌కు గురికావడం ఆందోళనకు గురిచేస్తోంది.

Viral Video: వామ్మో.. ఈ రోడ్డులో యుముడు రెడీగా ఉన్నాడు.. నెట్టింట షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..
Accident Live Video
Follow us on

Road Accidents Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. కొన్ని దృశ్యాలు అందరినీ అయోమయానికి గురిచేస్తుంటాయి. తాజాగా.. అలాంటి ఓ వీడియో నెట్టంట షేక్ చేస్తోంది. సాధారణంగా యాక్సిడెంట్ అనుకోకుండా జరుగుతుంది. కానీ.. ఈ రోడ్డులో ప్రయాణించే వాహనాలన్నీ యాక్సిడెంట్‌కు గురికావడం ఆందోళనకు గురిచేస్తోంది. వీడియోలో కనిపిస్తున్న రహదారిలో వాహనాలన్నీ యాక్సిడెంట్ అవుతుండటం, అసలు ఏం జరుగుతోందో, ఎలా జరుగుతుందో అర్ధంకావడం లేదంటూ పేర్కొంటున్నారు. అందుకే ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. దీన్ని చూసి కొందరు చలించిపోతుంటే.. మరికొందరు నవ్వుకుంటున్నారు. వీడియోలో రోడ్డుపై కనిపించిన వాహనాలన్నీ జారిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది.

వైరల్ వీడియో ప్రారంభంలో.. ఒక కారు అకస్మాత్తుగా రోడ్డుపై జారి.. పక్కన ఉన్న రైలింగ్‌ను ఎలా ఢీకొట్టిందో చూడవచ్చు. ఈ కారు తేరుకోకముందే వెనుక నుంచి ఒకదాని తర్వాత ఒకటి రెండు వాహనాలు వచ్చి దానిని ఢీకొంటాయి. ఇలాంటి ఘటనలు మరికొన్ని కెమెరాకు చిక్కాయి. ఈ వీడియోలో ఓ బైక్ కూడా రోడ్డుపై జారిపోవడం కనిపించింది. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఈ రహదారి మెక్సికో సిటీ, కొలోనియా లా కెనడాలో ఉందని పేర్కొంటున్నారు. ఈ రహదారి హైడ్రాలిక్ కాంక్రీట్‌తో తయారు చేయడం వల్ల వర్షాకాలంలో జారేలా చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ వీడియో చాలామందిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ఈ వీడియోను ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించగా వేలాది మంది లైకులు చేశారు. దీంతోపాటు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..