Viral Video : వార్నీ.. ఇదేక్కడి దారుణం రా సామీ..! ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇలా పనిచేస్తారా..? ఇంకా నయం..

|

May 16, 2024 | 8:55 PM

విమానం నుంచి కిందపడిన ఉద్యోగిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.. అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. విమానాశ్రయంలో ఉన్న ఓ మహిళ ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసింది. వీడియోలో, మహిళ అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. విమానాశ్రయ సిబ్బంది భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Viral Video : వార్నీ.. ఇదేక్కడి దారుణం రా సామీ..! ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇలా పనిచేస్తారా..? ఇంకా నయం..
Jakarta Airport
Follow us on

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేసినా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇండోనేషియాలోని ఓ విమానాశ్రయంలో జరిగిన వింత ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానం నుంచి ఓ ఉద్యోగి కిందపడిపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాదాన్ని చూసి అక్కడున్న జనం కేకలు వేశారు. ఇండోనేషియాలోని జకార్తా ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌బస్ A320 బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అన్ని చర్యలు దాదాపు పూర్తయ్యాయి. ఇంతలో విమానం ఎక్కేందుకు అమర్చిన మెట్లు ఒక్కసారిగా తొలగిపోయాయి. విమానంలోని ఒక ఉద్యోగి స్టెప్స్‌ తొలగించిన విషయాన్ని గమనించలేదు. మాట్లాడుకుంటూనే ఫ్లైట్‌లో నుంచి అడుగు ముందుకేసి కింద పడిపోయాడు.

కిందపడిన వ్యక్తిని చూసి అక్కడున్న వారు కేకలు వేశారు. అతని చేతిలో కాగితాలు ఉన్నాయి. అవి గాలిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ల్యాండింగ్ సమయంలో సదరు ఉద్యోగి విమానంలో ఉన్న వారితో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. అతను మెట్లపై దృష్టి పెట్టలేదు. అతను ఒక అడుగు ముందుకు వేయగానే నేరుగా కింద పడిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. విమానయాన నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ ఘటన జరిగింది. విమానం తలుపులు తెరిచినప్పుడు నిచ్చెనను తీసివేయకూడదు. సమాచారం ప్రకారం, జకార్తా ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

విమానం నుంచి కిందపడిన ఉద్యోగిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.. అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. విమానాశ్రయంలో ఉన్న ఓ మహిళ ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసింది. వీడియోలో, మహిళ అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. విమానాశ్రయ సిబ్బంది భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..