Viral Video: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచం మొత్తానికి తెలిసిన ఫైర్ బ్రాండ్ విరాట్. అతని ఆట తీరుతో ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. క్రికెట్ హిస్టరీలో కోహ్లీ రికార్డులు అనేకం. బ్యాట్ పట్టి క్రీజ్‌లోకి ఎంటరైతే.. ప్రత్యర్థికి దబిడి దిబిడే. బ్యాట్‌తో వీరవిహారం చేస్తూ పరుగుల వరద సృష్టిస్తారు. కెప్టెన్‌గా భారత క్రికెట్ జట్టుకునే ఎన్నో విజయాలు అందించాడు. ఈ విషయాలన్నీ మనకు తెలిసిందే. కానీ, మనకు తెలియని మరో విశేషం కూడా ఉంది. కోహ్లీలో ఒక క్రికెటర్ మాత్రమే కాదు.. గొప్ప సింగర్ కూడా. అవునండీ బాబూ.. ఇది మేం చెబుతున్నది కాదు స్వయంగా కోహ్లీనే చెప్పాడు. కోహ్లీ పాట పడుతున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.
1963లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘తాజ్ మహల్’ లోని ‘జో వదా కియా వో నిభానా పడేగా’ పాటను అద్భుతంగా పాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు. దీనికి సంబంధించిన త్రోబ్యాక్ వీడియోను విరాట్ కోహ్లీ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. 2016లో ఆసియా కప్ టీ20 కోసం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టును భారత్ ఓడించిన తరువాత రోజున ఇండియన్ హైకమిషన్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా.. బంగ్లాదేశ్ గాయని ఫహ్మిదా నబీతో కలిసి పాట పాడాడు. కోహ్లీ పాట పాడుతుండగా కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను తాజాగా యువరాజ్ సింగ్.. కోహ్లీకి షేర్ చేయగా.. విరాట్ దానిని ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కోహ్లీలో చాలా షేడ్స్ ఉన్నాయంటూ కితాబిస్తున్నారు. మల్టీటాలెంటెడ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా వ్యూస్, 25 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
కాగా, ఈ పాటను లెజెండరీ సింగర్స్ మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ కలిసి పాపడారు. ‘ఇది రఫీ – లత మాయాజాలం, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కోహ్లీ చాలా అద్భుతంగా పాడాడు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.
Also read:
Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!
Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!
Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..