India Post recruitment 2022: పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్‌ల పోస్టుల కోసం భారతీయ పోస్టల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియా పోస్ట్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 38926 పోస్టల్ సేవకులను నియమించనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ మే 2, 2022 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 5 వరకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఒక్కసారి చదివితే మంచిది.
ఎలా దరఖాస్తు చేయాలి..?
1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్స్ రిక్రూట్‌మెంట్ 2022కి వెళ్లండి.
3. తర్వాత ఆన్‌లైన్ గ్రామీణ డాక్ సేవక్ ఎంగేజ్‌మెంట్‌పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీ వివరాలను ధృవీకరించు ఎంపికకు వెళ్లండి.
5. ఇక్కడ మొబైల్ నంబర్, ఈ మెయిల్ సహాయంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
6. రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
7. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులకు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
వయస్సు పరిధి
అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు 40 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్‌డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి