Viral Video: ఓరీ దేవుడో…! పామునుపట్టి లుంగీలో దాచుకున్నాడు
పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో ఆమడదూరం పరిగెడతారు. అందులోనూ ఆరు అడగులు పామును చూశారంటే ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు.
పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో ఆమడదూరం పరిగెడతారు. అందులోనూ ఆరు అడగులు పామును చూశారంటే ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. కానీ ఇక్కడ ఇదిగో ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తికి మాత్రం పాములు పట్టడం అంటే ఓ సరదా.. అలాంటిలాంటి సరదా కాదు.. ఆరు అడుగుల పామునైనా పాము పిల్లను పట్టుకున్నట్టు పట్టుకుని ఓ ఆటాడిస్తాడు. అంతటితో అయిపోలేదండోయ్. ఆ పామును పట్టుకుని ఎక్కడో కాదు తన లుంగీలోనే బంధించుకుని ఏమీ ఎరుగనట్టే వెళ్లిపోయాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ఇదిగో ఈ వీడియో చూడండి మీరు నమ్మడమే కాదు.. వీడెవడండీ బాబూ అని ముక్కున వేలేసుకోవడం ఖాయం.
Also Watch:
బాక్సాఫీస్ బాస్ చిరుకి ఘోర పరాభవం రెండో రోజు నో కలెక్షన్స్
చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్
చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి
మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్