ఫెయింజల్ తుఫానులో చిక్కుకున్న విమానం.. పైలట్ తెలివితో ప్రయాణికులు సేఫ్‌..! షాకింగ్‌ వీడియో వైరల్‌

కానీ, పైలట్ నేర్పుతో పెను ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలంగా లేదని గ్రహించిన పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫెయింజల్ తుఫానులో చిక్కుకున్న విమానం.. పైలట్ తెలివితో ప్రయాణికులు సేఫ్‌..! షాకింగ్‌ వీడియో వైరల్‌
Cyclone Fengal

Updated on: Dec 01, 2024 | 6:52 PM

నవంబర్ 25న బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెయింజల్ తుఫాను నవంబర్ 30 రాత్రి 7:30 గంటలకు పుదుచ్చేరిలోని కారైకాల్, తమిళనాడులోని మహాబలిపురం మధ్య తీరాన్ని తాకింది. దీంతో చెన్నై వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రభావం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చెన్నై విమానాశ్రయంలో ఫెయింజల్ తుఫాను కారణంగా విమానం ల్యాండింగ్ విఫలమైంది. చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం క్రాస్ గాలులో ఇరుక్కుపోయి ఊగిసలాడింది. రన్‌వేపైనే విమానం మళ్లీ టేకాఫ్‌ చేయాల్సి వచ్చింది. బలమైన గాలి, రన్‌వేపై నీరు నీరు నిలిచిపోవడంతో విమానం ల్యాండింగ్‌లో ఇబ్బందిగా మారింది. దీంతో మళ్లీ టేకాఫ్‌ చేయాల్సి వచ్చింది. తుపాను కారణంగానే విమానం ల్యాడింగ్‌లో సమస్య తలెత్తింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కానీ, పైలట్ నేర్పుతో పెను ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలంగా లేదని గ్రహించిన పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, ఈ ఘటనకు సంబంధించి ఇండిగో నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..