దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొన్నిసార్లు వారు స్ఫూర్తిదాయకమైన, కొన్నిసార్లు ఫన్నీ పోస్ట్‌లను షేర్ చేస్తుంటారు. కొన్నిసార్లు వారు తమ పోస్ట్‌ల ద్వారా సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. కొన్నిసార్లు వారు జీవితంలోని మంచి, చెడు విషయాలను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరినీ ఆలోచింపజేసింది. ఈ ఫోటో టైటానిక్ మునిగిపోయిన దృశ్యాన్ని చూపుతుంది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటో ద్వారా కాలంతో పాటు మనం మొబైల్ ఫోన్‌లకు ఎలా బానిసలుగా మారుతున్నామో చెప్పే ప్రయత్నం కనిపించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓడ ఒకటి మునిగిపోతున్న సమయంలో అందులోని జనం కూడా మునిగిపోయారు. కానీ, వారంతా నీటిలో మునిగిపోతున్నామనే ఆలోచనను పక్కపెట్టి.. ఓడ మునిగిపోతున్న దృశ్యాలను తమ మొబైల్ కెమెరాల్లో రికార్డు చేస్తున్నట్టుగా కనిపించింది. అయితే, ఇక్కడో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఫోటో ఈరోజుది కాదు 2015 నాటిది.
ఈరోజు టైటానిక్ మునిగిపోతే…
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (@anandmahindra) ఈ ఫోటోను పోస్ట్ చేసారు. ఈ మీమ్ మొదటిసారిగా 2015 లో వైరల్ అయ్యింది. కానీ, టైటానిక్ ఈ రోజు మునిగిపోయి ఉంటే..అంటూ క్యాప్షన్‌లో రాశాడు.. కానీ, ఈ మీమ్‌లోని ఫోటో రోజురోజుకు మరింత సందర్భోచితంగా మారుతోంది.
“If the Titanic sank today..”
This meme first came out back in 2015. But it feels more and more relevant with every passing day… pic.twitter.com/LSKizjco3q— anand mahindra (@anandmahindra) January 12, 2024
మహీంద్రా ట్వీట్‌కు ఇప్పటి వరకు 50,000 మందికి పైగా వీక్షణలు వచ్చాయి. అయితే చాలా మంది దానిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహీంద్రా పోస్ట్ చేసిన ఫోటోను ఓ ఆర్టిస్ట్ రూపొందించారు. ఫోటోలో టైటానిక్ మునిగిపోతున్నట్లు కనిపిస్తోంది. దాంతో నీళ్లలో పడి ఉన్న వాళ్లంతా ఫోన్‌లు తీసి వీడియో తీస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఫోటోకు చాలా మంది వినియోగదారులు భిన్నమైన స్పందనలు ఇస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ప్రజలు తమ సెల్ ఫోన్ గోలలో పడి మునిగిపోతున్నారంటూ వాపోయారు. వాస్తవానికి మనం కాలక్రమేణా మొబైల్‌కు బానిసలుగా మారుతున్నామని ఇతర వినియోగదారులు వ్యాఖ్యనించారు. నిజంగానే మనమందరం ఆలోచించడం, అర్థం చేసుకోవడం మానేశామంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..