Video: భారీ వర్షాలు.. బైక్‌తో సహా డ్రైనేజీలో పడిపోయిన ఫుడ్‌ డెలవరీ బాయ్‌! మన హైదరాబాద్‌లోనే..

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డ్రైనేజీలో పడిపోయిన ఘటన వైరల్ అయింది. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలను ఈ ఘటన హైలైట్ చేసింది. వర్షాలకు సంబంధించి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Video: భారీ వర్షాలు.. బైక్‌తో సహా డ్రైనేజీలో పడిపోయిన ఫుడ్‌ డెలవరీ బాయ్‌! మన హైదరాబాద్‌లోనే..
Delivery Boy

Updated on: Aug 11, 2025 | 10:01 AM

భారీ వర్షాలకు హైదరాబాద్‌ రోడ్లు జలమయం అయ్యాయి. చాలా చోట్ల రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఇంత భారీ వర్షంలోనూ ఫుడ్‌ డెలవరీ బాయ్‌లో జీవనోపాధి కోసం వాళ్ల పనిని వదల్లేదు. అయితే ఓ డెలవరీ బాయ్‌ మాత్రం పాపం బైక్‌తో సహా డ్రైనేజీలో పడిపోయాడు. హైదరాబాద్‌ మహానగరంగా అభివృద్ధి చెందింది అని మన ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. అక్కడక్కడా ఇలాంటి పరిస్థితి కనిపస్తూనే ఉంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వర్షం వస్తే రోడ్లన్నీ చెరువుల్ని తలపించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే శనివారం కురిసిన వర్షానికి.. టీకేఆర్‌ కమాన్‌ వద్ద రోడ్లు నీటితో నిండిపోయాయి. ఎక్కడ డ్రైనేజీ ఉందో కూడా గుర్తించడం కష్టంగా మారింది. అటుగా ఫుడ్‌ డెలవరీ చేసేందుకు వెళ్తున్న ఓ కుర్రాడు పాపం బైక్‌తో సహా కమాన్‌ వద్ద డ్రైనేజీలో పడిపోయాడు. బైక్‌ కొట్టకుపోయింది, అతను ఫోన్‌ కూడా పోగొట్టుకున్నాడు. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇంతా కష్టం చేస్తుంటే.. పాపం ఆ ఫుడ్‌ డెలవరీ బాయ్‌కి రెయిన్‌సర్జ్‌ కింద వచ్చేది కేవలం రూ.10 అని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి