Wedding: ఏడేళ్లుగా ప్రేమలో.. అయినా పెళ్లయిన మొదటి రాత్రే విడాకులు అడిగిన భర్త.. కారణమడిగితే?
పెళ్లి తర్వాత తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న ఆ అమ్మాయికి మొదటి రాత్రే నరకం చూపించాడా భర్త. తనకు ఆ అమ్మాయి భార్యగా వద్దని వెంటనే విడాకులు కావాలని పట్టుబడుతున్నాడు.
వారిద్దరూ ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఒకరి అభిరుచులు, ఇష్టాయిష్టాలు మరొకరు తెలుసుకున్నారు. తమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే ఇరు పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగుల ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న ఆ అమ్మాయికి మొదటి రాత్రే నరకం చూపించాడా భర్త. తనకు ఆ అమ్మాయి భార్యగా వద్దని వెంటనే విడాకులు కావాలని పట్టుబడుతున్నాడు. కారణం అడిగితే తన భార్య కన్య కాదని పెళ్లికి ముందే వేరొకరితో సంబంధం ఉందంటున్నాడు. అతని అనుమానం ముందు ఏడేళ్ల ప్రేమ కూడా చిన్నబోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సయ్యద్ బాసిత్ అలీ అనే ఐడీతో యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరూ కనిపిస్తున్నారు. రిపోర్టర్ అభ్యర్థన మేరకు వివాహం అయిన మొదటి రాత్రి విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటో ఇలా వివరంగా చెప్పుకొచ్చాడా భర్త. ‘నా భార్య వర్జిన్ కాదు. మొదటిరాత్రే ఆమె నిజస్వరూపం తెలిసింది. పెళ్లికి ముందే నా భార్యకు వేరొకరితో సంబంధాలు ఉన్నాయి’ అని ఆరోపణలు గుప్పించాడు.
కాగా పెళ్లికి ముందు ఏడేళ్ల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్నారు కదా? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘మేం ఇద్దరం ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నది నిజమే. అయితే మేం వారానికి 1-2 సార్లు మాత్రమే కలుసుకునేవాళ్లం. మిగిలిన సమయంలో ఆమె ఇంట్లో ఏమి చేస్తుందో నాకెలా తెలుస్తుంది. నేను కన్య అనుకునే ఆమెను పెళ్లాడాను. కానీ మొదటి రాత్రి ఆమె వర్జిన్ కాదని తేలిపోయింది. నేను జీవితంలో సెటిల్ అయ్యేందుకు పెళ్లి చేసుకున్నానని, అంతేకానీ ఎవరో వాడిన వస్తువును ఇంట్లో అలంకరించేందుకు కాదు’ అని అసభ్యకరంగా, హేయంగా మాట్లాడాడు. దీంతో సదరు రిపోర్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో అతనిని బయటకు వెళ్లమంటూ తోసయడం మనం చూడవచ్చు. మరోవైపు ఈ విషయంపై మహిళ స్పందిస్తూ.. ఇప్పటికీ తన ప్రేమను, తన భర్తను గౌరవిస్తున్నానని, ప్రేమిస్తున్నానంటూ కన్నీరు పెట్టుకుంది. అయితే అతను తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడని వాపోయింది. ఇక వీడియో చివర్లో రిపోర్టర్ కూడా ‘ఓ మహిళను ఇలా దూషించడం, అనుమానించడం పూర్తిగా తప్పు అని.. ఇది ఆడవాళ్ల జీవితాన్నే నాశనం చేస్తుంది’ అని చెప్పడం మనం చూడవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..