AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. యువకుణ్ని అమాంతంగా మింగేసిన తిమింగలం.. ఆ తర్వాత

సముద్రంలో ఒక చిన్న పడవలో ప్రయాణిస్తున్న ఒక యువకుడిని అకస్మాత్తుగా ఒక పెద్ద తిమింగలం పడవతో పాటు మింగేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, కొన్ని సెకన్లలోనే అది ఎటువంటి నష్టం కలిగించకుండా తిరిగి బయటకు ఉమ్మేసింది. ఈ సంఘటన చిలీలోని పటగోనియాలో జరిగింది. కేవలం 2 సెకన్లలో, తిమింగలం తుఫానులా వచ్చి అతన్ని సునామీలా మింగేస్తుంది. ఆ తరువాత జరిగిన అద్భుతాన్ని బహుశా ఆ వ్యక్తి కూడా ఊహించనిది జరుగుతుంది. ఈ సంఘటన మొత్తం వైరల్‌ కావడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేశారు.

Watch: భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. యువకుణ్ని అమాంతంగా మింగేసిన తిమింగలం.. ఆ తర్వాత
Humpback Whale Swallows Man
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2025 | 8:37 AM

Share

సముద్రంలో ఒక చిన్న పడవలో ప్రయాణిస్తున్న ఒక యువకుడిని అకస్మాత్తుగా ఒక పెద్ద తిమింగలం పడవతో పాటు మింగేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, కొన్ని సెకన్లలోనే అది ఎటువంటి నష్టం కలిగించకుండా తిరిగి బయటకు ఉమ్మేసింది. ఈ సంఘటన చిలీలోని పటగోనియాలో జరిగింది. కేవలం 2 సెకన్లలో, తిమింగలం తుఫానులా వచ్చి అతన్ని సునామీలా మింగేస్తుంది. ఆ తరువాత జరిగిన అద్భుతాన్ని బహుశా ఆ వ్యక్తి కూడా ఊహించనిది జరుగుతుంది. ఈ సంఘటన మొత్తం వైరల్‌ కావడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేశారు.

చిలీలోని దక్షిణ పటగోనియా ప్రాంతంలోని శాన్ ఇసిడ్రో లైట్‌హౌస్ సమీపంలో గత శనివారం ఈ భయానక సంఘటన జరిగింది. ఆడ్రియన్‌ సిమన్‌కాస్‌ అనే యువకుడు తన తండ్రి డెల్‌తో కలిసి చిరు పడవలతో సముద్రంలోకి వెళ్లారు. వీరికి అనుకోకుండా ఎదురుపడిన తిమింగలం ఆడ్రియన్‌తోపాటు పసుపు రంగులో ఉన్న అతడి చిరు పడవను నోటకరచింది. కానీ, అతడి అదృష్టం బాగుంది.. కొన్ని క్షణాల్లోనే అది అతన్ని వదిలేసింది. కుమారుడికి కొన్ని గజాల దూరంలో ఉన్న డెల్‌ ఆ దృశ్యాన్ని వీడియోలో రికార్డ్‌ చేశాడు. కొడుకుని భయపడకుండా ఉండమంటూ.. అలాగే ఉండు.. అలాగే ఉండు అంటూ కేకలు వేశాడు.. ఆ వెంటనే తిమింగలం వారికి దూరంగా వెళ్లిపోవటంతో వారు కూడా బతుకు జీవుడా అనుకుని.. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

తీరానికి చేరుకున్నాక ఆడ్రియన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తిమింగలం నన్ను మింగేస్తుంది. నా పనైపోయింది అనుకున్నాను.. కానీ, ఎలాగోలా బతికి బయటపడ్డాను అంటూ ఆ భయానక అనుభవాన్ని వివరించాడు. అంతకుముందు, నవంబర్ 2020లో కాలిఫోర్నియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ ఒక హంప్‌బ్యాక్ తిమింగలం రెండు కయాకర్లను మింగేసింది. ఇద్దరూ తిమింగలాలు వెండి చేపలను మింగడం చూస్తుండగా, అకస్మాత్తుగా ఒక తిమింగలం వాటిని కింద నుండి మింగేసింది. అయితే, వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..