AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కిచెన్ పైకప్పు నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా బయటపడ్డ భారీ పైథాన్..!

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే చాలు మనకు గుండె ఝల్లుమంటుంది. అలాంటిది ఆ పాము మన ఇంట్లో...

Viral Video: కిచెన్ పైకప్పు నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా బయటపడ్డ భారీ పైథాన్..!
1
Ravi Kiran
|

Updated on: May 21, 2021 | 8:23 PM

Share

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే చాలు మనకు గుండె ఝల్లుమంటుంది. అలాంటిది ఆ పాము మన ఇంట్లో తిష్టవేసిందని తెలిస్తే.? ఇంకేమైనా ఉందా.? గజగజ వణికిపోవాల్సిందే..! ఇలాంటి పరిస్థితే ఓ ఫ్యామిలీకి ఎదురైంది. తమ కిచెన్ పైకప్పు మీద ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి అని వెళ్లినవారికి ఊహించని షాక్ తగిలింది.

సుమారు మూడు మీటర్ల పొడవు.. 100 పళ్లు.. 8 కేజీల బరువు ఉన్న పెద్ద పైథాన్ కనిపించింది. ఈ భారీ సర్పాన్ని పట్టుకునేందుకు ఆ కుటుంబం స్టీవ్ అనే స్నేక్ క్యాచర్‌ను పిలిచింది. దాన్ని పట్టుకునేందుకు అతడికి సుమారు గంటన్నర సమయం పట్టింది.

ఈ జాతికి చెందిన పైథాన్‌లు విషపూరితం కాదని చెప్పిన స్టీవ్.. ఇంతటి భారీ సైజ్ ఉన్న పైథాన్ ఒక్క కాటు వేసినా అత్యంత ప్రమాదకరమని తెలిపాడు. బ్రిస్బేన్ చుట్టుప్రక్కల ఈ జాతి పైథాన్‌లు తరచూ కనిపిస్తాయని.. ఇంటి పైకప్పుల మీద నివసిస్తూ ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయని స్టీవ్ చెప్పుకొచ్చాడు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

Follow Us