Viral video: బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్‌.. వెరైటీ పంచులతో పోలీసుల ట్వీట్‌.. వీడియో వైరల్

| Edited By: Ram Naramaneni

Aug 04, 2022 | 1:02 PM

Viral video: దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బైక్‌లను నడుపుతుండటం, మద్యం సేవించి నడుపుతుండటం వల్ల ప్రమాదాలకు..

Viral video: బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్‌.. వెరైటీ పంచులతో పోలీసుల ట్వీట్‌.. వీడియో వైరల్
Viral Video
Follow us on

Viral video: దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బైక్‌లను నడుపుతుండటం, మద్యం సేవించి నడుపుతుండటం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసు శాఖ ఎంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. ఏ మాత్రం ఆగడం లేదు. ఇక కొందరు బైక్‌ నడిపే వారు మాత్రం వారి స్టంట్లు చూస్తుంటే భయాందోళన కలిగించేలా ఉంటాయి. ఎంతో మంది యువకులు బైక్‌ స్టంట్లకు పాల్పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియోను సోషల్‌ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. ఓ యువకుడు డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చేస్తూ అదుపుతప్పి కిందపడిపోయిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

 

ఇవి కూడా చదవండి


యువత ఇలాంటి బైక్‌ స్టంట్లు చేయడం చాలా ప్రమాదకరమని చెబుతూనే దానికి కాస్త కామెడీని జోడించి వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఓ యువకుడు రోడ్డు వెంట బైక్‌ నడుపుకొంటూ స్టంట్‌ చేస్తూ అదుపు తప్పి కిందపడిపోయాడు. అదృష్టం ఏంటంటే.. అతనికి హెల్మెంట్‌ ఉండటంతో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. కానీ బైక్‌ మాత్రం తీవ్రంగా ధ్వంసమైంది. ఇలాంటి స్టంట్లు చేస్తే కుదరదని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని పోలీసులు తమదైన రీతిలో పంచ్‌ డైలాగులతో ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి