Viral Video: ఓరేయ్​ ఇదేం చాయ్‌రా… ఈ వీడియో చూస్తే టీ లవర్స్​ చస్తారు..

|

Jul 14, 2024 | 5:17 PM

ఇలాంటి టీని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే ఈ టీలో ఎనర్జీ డ్రింక్ కలుపుతున్నారు. టీ తాగితేనే ఎనర్జీ వస్తుందని భావించే వారికి మరింత ఎక్కువ ఎనర్జీ డ్రింక్ కలిపి తయారు చేసిన చాయ్‌ తాగితే ఏమవుతుందో ఊహించుకోకపోవడమే మంచిది. మరి ఈ వింత వంటకాన్ని ఎలా తయారు చేస్తారో చూస్తేమాత్రం అవాక్ అవుతారు. మీరు కూడా టీ ప్రియులైతే, ఈ వీడియో చూసిన తరువాత మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే..!

Viral Video: ఓరేయ్​ ఇదేం చాయ్‌రా... ఈ వీడియో చూస్తే టీ లవర్స్​ చస్తారు..
Energy Drink Tea
Follow us on

దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి వ్యక్తి టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. టీ తాగకుండా ఉండలేని వారు చాలా మంది ఉన్నారు. కప్పు చాయ్‌ కడుపులో పడకపోతే, ఏ పని సాగదు. కాబట్టి అలాంటి టీ ప్రియుల కోసం నేడు మార్కెట్‌లో రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వేడి టీ నచ్చని వారికి కోల్డ్ టీ, పుల్లటి టీ ఇష్టపడే వారికి లెమన్ టీ, స్ట్రాంగ్ టీ ఇష్టపడే వారికి మసాలా చాయ్‌. టీని కొంచెం తియ్యగా ఇష్టపడే వారికి ఇరానీ చాయ్‌. ఇలా విభిన్న రుచుల్లో లభించే టీని ఆస్వాదిస్తుంటారు చాయ్‌ ప్రియులు. అయితే, ఇప్పుడు కొత్త టీ తెరపైకి వచ్చింది. ఈ రకాన్ని స్టింగ్ ఎనర్జీ డ్రింక్ టీ అంటున్నారు. ఈ టీ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుందని చెబుతున్నారు. కానీ నెటిజన్లు మాత్రం ఈ టీ రెసిపీని చూసి చాలా ఎగ్జైట్ అవుతన్నారు. మరి ఈ టీని ఎలా తయారు చేస్తారో చూద్దాం.

ఇలాంటి టీని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే ఈ టీలో ఎనర్జీ డ్రింక్ కలుపుతున్నారు. టీ తాగితేనే ఎనర్జీ వస్తుందని భావించే వారికి మరింత ఎక్కువ ఎనర్జీ డ్రింక్ కలిపి తయారు చేసిన చాయ్‌ తాగితే ఏమవుతుందో ఊహించుకోకపోవడమే మంచిది. మరి ఈ వింత వంటకాన్ని ఎలా తయారు చేస్తారో చూస్తేమాత్రం అవాక్ అవుతారు. మీరు కూడా టీ ప్రియులైతే, ఈ వీడియో చూసిన తరువాత మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే..!

ఇవి కూడా చదవండి

ఈ కొత్త రకం టీ తయారీ కోసం ముందుగా పాలలో పంచదార, టీ ఆకులు వేసి ఆ మిశ్రమాన్ని బాగా మరిగించాలి. అప్పుడు టీ మరుగుతున్న వెంటనే, దానిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ పోశారు. మరి కాసేపు మరిగించిన తర్వాత స్టింగ్‌వాలా టీ రెడీ అవుతుంది. అంతే, ఇక టీ గ్లాసులో పోసుకుని అందులో మరికాస్త కూల్‌డ్రింక్‌ పోశారు. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ పేజీ f4foodi ద్వారా షేర్ చేశారు. ఈ టీని ఇప్పటివరకు 31 లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు. చాలా మంది దీనికి ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు.

స్టింగ్‌ ఎనర్జీ టీ తయారీ చూసిన ప్రతి ఒక్కరు స్పందించారు. జనాల్ని చంపేందుకే ఇలాంటి టీ తయారు చేస్తున్నారని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేయగా, మరొకరు ఫన్నీగా ఈ టీలో కాస్త హార్పిక్ కూడా కలిపేయండి ఓ పనై పోతుంది అంటూ వ్యాఖ్యనించారు. టీలో చేసిన ఈ ప్రయోగం చాలా మందికి నచ్చలేదు. అందుకే టీ ప్రియులు ఆగ్రహంగా స్పందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి