Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని పదాలు ఉన్నాయో చెప్పగలరా? మొదట చూసేది మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది!
ఎన్నో చిత్ర విచిత్రమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలకు...
ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల ట్రెండ్ ఇంటర్నెట్‌లో విరివిగా కొనసాగుతోంది. మన మెదడును ఆటపట్టించే ఈ ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో చాలామంది నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు.. వీటి ద్వారా వ్యక్తుల మనస్తత్వాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎన్నో చిత్ర విచిత్రమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలకు సెపరేట్‌గా పేజీలు కూడా ఉన్నాయి. ఎలప్పుడూ మన మనస్సుతో ఆడుకునే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట కోకొల్లలు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. అవేంటో కనిపెట్టండి. మీరు ఈజీగా గుర్తించవచ్చు. చెప్పగలరా..
1…
2….
3…
Go…
Good, Evil.. ఈ రెండు పదాలు ఉన్నాయి. అదే తెలుగులో చెప్పాలంటే మంచి, చెడు.. ఇక మీరు చూసే పదం మీ వ్యక్తిత్వ లక్షణాలను తెలియజేస్తుంది.
1. మీరు మొదటిగా ‘Good’ చూసినట్లయితే?
Good అనే పదాన్ని మొదట చూసినట్లయితే.. వారు తమ జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అలాంటివారు ఆశావాదులు. స్వీయ ప్రేరణతో ఉంటారు. ఇతర సానుకూల వ్యక్తులతో కలిసి ఉంటారు. ఇలాంటివారు ప్రతికూల పరిస్థితిలో అవకాశం కోసం వెతుకుతారు. ఎప్పుడూ సంతోషం, ఆనందంగా ఉంటారు.
2. మీరు మొదట ‘Evil’ అనే పదాన్ని చూసినట్లయితే?
‘Evil’ అనే పదాన్ని మొదట చూసిన వారు, ఇతరులను ఎక్కువగా నమ్మలేరు. వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లతో ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలోని పాజిటివ్ సైడ్‌ను కూడా చూడాలి. ఎప్పుడూ కావాలనుకున్న వాటిని చివరి వరకు వెంట ఉంచుకోరు. ఎత్తైన శిఖరాలను అధిరోహించినా ప్రతికూలతను మాత్రమే చూస్తారు. ఉన్నదానితో తృప్తిపడటం కంటే.. లేనిదాని కోసం తాపత్రయపడతారు.
Find The Words In this Viral Picture@WhatsTrending @TheViralFever @the_viralvideos @TrendingWeibo @itsgoneviraI #Trending #Viral pic.twitter.com/Ouph0eQvaD
— telugufunworld (@telugufunworld) July 5, 2022