Viral News: అయ్యో.! పాపం బాతు..!! గుర్రానికి అడ్డు తగిలింది.. ప్రాణం మీదుకు తెచ్చుకుంది..

Horse Kicked Duck: ఎప్పుడూ సైలెంట్ గా ఉన్నవారి దారికి అడ్డంగా వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే పర్యావసానంగా ఊహించని పరిణామాలు..

Viral News: అయ్యో.! పాపం బాతు..!! గుర్రానికి అడ్డు తగిలింది.. ప్రాణం మీదుకు తెచ్చుకుంది..
Horse
Follow us
Ravi Kiran

|

Updated on: May 07, 2021 | 6:03 PM

Horse Kicked Duck: ఎప్పుడూ సైలెంట్ గా ఉన్నవారి దారికి అడ్డంగా వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే పర్యావసానంగా ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది పెద్దలు చెప్పిన మాట. ఈ నీతి మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. ఎందుకంటే తన దారిలో సైలెంట్ గా వెళ్తున్న ఓ గుర్రానికి అడ్డు తగిలి బాతు ఏకంగా తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇందులో ఓ గుర్రం చాలా ప్రశాంతంగా తన యజమానితో కలిసి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఆ పక్కనే ఉన్న రెండు బాతుల్లో ఒకటి దానికి అడ్డు తగులుతుంది. తనని అనవసరంగా కెలికితే గుర్రం ఊరుకుంటుందా..! వెనక నుంచి ఒక్కసారిగా ఆ బాతును ఎగిరి తన్నుతుంది. అంతే ఆ బాతు అమాంతం అల్లంత దూరానికి దొర్లుకుంటూ వెళ్లి పడుతుంది.

ఈ ఫన్నీ వీడియోను ‘ది డార్క్ సైడ్ అఫ్ నేచర్’ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఇది కొద్దిసేపటిలోనే వైరల్ గా మారింది. సుమారు రెండు కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. మనిషైనా, జంతువు అయినా సైలెంట్ గా ఉన్న వ్యక్తులను ఆటపట్టించినట్లయితే, దాని ప్రతిచర్య ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?