AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horse Eats Chicken: మాంచి ఆకలి మీదున్న గుర్రం లటక్కున కోడిపిల్లను మింగేసింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Horse Eats Chicken: గుర్రానికి బాగా ఆకలేస్తే పచ్చగడ్డికి బదులు ఎండుగడ్డి కూడా తింటుందని నానుడి. కానీ ఇక్కడ ఓ గుర్రానికి బాగా ఆకలేసిందో లేక దానికి కూడా..

Horse Eats Chicken: మాంచి ఆకలి మీదున్న గుర్రం లటక్కున కోడిపిల్లను మింగేసింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Horse Chicken
Shiva Prajapati
|

Updated on: Dec 22, 2021 | 12:23 PM

Share

Horse Eats Chicken: గుర్రానికి బాగా ఆకలేస్తే పచ్చగడ్డికి బదులు ఎండుగడ్డి కూడా తింటుందని నానుడి. కానీ ఇక్కడ ఓ గుర్రానికి బాగా ఆకలేసిందో లేక దానికి కూడా చికెన్‌ తినాలనిపించిందో తెలియదు కానీ.. ఓ కోడిపిల్లను లటుక్కున పట్టేసి గుటుక్కున మింగేసింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేం విపరీతం సామీ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వైరల్ వీడియోలో ఒక గుర్రం ఉండే ప్రదేశంలోకి ఒక కోడి తన పిల్లలను తీసుకొని వచ్చింది. అక్కడ ఏదైనా మేత దొరుకుతుందేమోనని వెతుకుతుంది. గుర్రం తినేది గడ్డే కదా.. నన్నేం చేస్తుందిలే అనుకున్న కోడికి ఊహించని షాకిచ్చింది ఆ గుర్రం. ఆ గుర్రం అడ్డాలో తన తల్లితోపాటు మేత మేస్తున్న కోడిపిల్లలపై ఆ గుర్రం కన్ను పడింది. అంతే ఓ కోడిపిల్లను చటుక్కున పట్టేసి నమిలి తినేసింది. పాపం తల్లి కోడి దానిని రక్షించుకుందామని గుర్రం మీద తిరగబడింది. కానీ ఫలితం లేకపోయింది. దాంతో మిగిలిన మూడు పిల్లలను తీసుకొని బాధతో అక్కడినుంచి బయటపడింది. తన కళ్ల ముందే తన పిల్లను గుర్రం తినేయడంతో.. ఆ తల్లి పెట్ట తీవ్ర ఆవేదన చెందింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని nature27_12 అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయ్యో.. గుర్రాలు కూడా నాన్‌వెజ్‌ తింటాయా అని వాపోతున్నారు. నిజానికి గుర్రం శాఖాహారి.. ఎందుకంటే దాని బాడీలో జీర్ణ ప్రక్రియ.. శాఖాహారాన్ని మాత్రమే అరిగించుకునేలా ఉంటుంది. అది మాంసం తిన్నా సరిగా అరగదు. అప్పుడప్పుడు వాటికి గుగ్గిళ్లతో కలిపి చేపలను కూడా పెడుతుంటారు కొందరు. అది తెలియక గుగ్గిళ్లే అని తినేస్తుంది తప్ప మాంసాహారం జోలికి పోదు. బహుశా ఈ గుర్రం కూడా అలాంటి బాపతేనేమో.. చికెన్‌పై మనసుపడి కోడి పిల్లను తినేసినట్టుంది.

Viral Video:

Also read:

Disinvestment: ప్రస్తుతానికి ఆ బ్యాంకుల ప్రయివేటీకరణ లేనట్టే.. కీలక సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..

అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..