అమ్మాయిలు లేదా అబ్బాయిలతో పరిచయం పెంచుకోవడం, ప్రేమలోకి దింపడం ఈ మధ్య కాలంలో చాలా సులువైంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు దునియా మన చేతిలో ఉన్నట్టే.. సోషల్ మీడియా వాడకం ఇప్పుడు ఎక్కువైపోయింది. కొంత మంది మరీనూ.. అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ ఆన్ లైన్ లో మాత్రం ఉండాల్సిందే.. ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్, గూగుల్, టిండర్ అంతే కాదు గూగుల్ పే, ఫోన్ పే , పేటియం ఇలా చాలా యాప్ లు ఉన్నాయ్ . వీటన్నిటితో యువత ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సోషల్ మీడియా బారిన పది జీవితాలను కోల్పోయిన వారు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీకి కూడా బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లో మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు యువత బలి కావద్దని పిలుపునిచ్చారు.
ఇక వాట్సాప్ లేకుండా ఇప్పట్లో ఎవ్వరూ ఉండరు. ఈ చాటింగ్ యాప్ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. రోజు రోజుకు ఈ యాప్ లో కొత్త కొత్త ఫ్యూచర్స్ కూడా యాడ్ అవుతుంటాయి. అలాగే యువత రకరకాల ఫోటోలు, వీడియోలు స్టేటస్ లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే అమ్మాయిలకు వాట్సాప్ లో హార్ట్ సింబల్ పంపితే ఇక జైలు శిక్ష తప్పదంట.
సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో రూల్స్ కొంచం స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇప్పటికే అక్కడ అనేక రకాల చట్టాలు తీసుకొచ్చారు కూడా.. తాజాగా సౌదీ అరేబియా, కువైట్‌లో వాట్సాప్ లేదా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అమ్మాయిలకు హార్ట్ ఎమోజీని పంపడం నిషేధించింది. ఇలా అమ్మాయిలకు హార్ట్ సింబల్ పంపడం పంపడం చట్టం ప్రకారం నేరం అని తెలిపింది. కువైట్‌లో హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్ల అంటే ఇండియన్ రూపీస్ ప్రకారంరూ.5,35,825 జరిమానా విధిస్తున్నారు. అలాగే సౌదీలో రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష అలాగే 100,000 సౌదీ రియాల్స్ , ఇండియన్రూ రూపీస్ ప్రకారం రూ 21,93,441 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.