Valentines Day: వాలంటైన్స్ డే ‘ఫ్రీ’ ఆఫర్.. ప్రేమికులకు తాజ్ హోటల్ ఆహ్వానం.? అసలు నిజమిదే..
Valentines Day Scam: ఫిబ్రవరి వచ్చిందంటే చాలు.. వాలంటైన్స్ వీక్ సందడి మొదలవుతోంది. ప్రేమికుల రోజు కోసం వెయిట్ చేస్తూ.. ఆల్రెడీ..

Valentines Day Scam: ఫిబ్రవరి వచ్చిందంటే చాలు.. వాలంటైన్స్ వీక్ సందడి మొదలవుతోంది. ప్రేమికుల రోజు కోసం వెయిట్ చేస్తూ.. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్లు తన ప్రియురాలికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తుంటే.. ఇప్పుడే ప్రేమలో దిగినవాళ్లు తన ప్రేమికురాలిని ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చి పడేయాలని ఆలోచిస్తుంటారు. ఇలా పలు రకాల ఆలోచనలతో ఉన్నవాళ్లందరికీ తాజాగా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ ఆకర్షించింది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా తాజ్ హోటల్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించిందని దాని సారంశం.
”తాజ్ హోటల్ నుంచి నాకు ఓ గిఫ్ట్ కార్డు వచ్చింది. దీనితో ఏడు రోజుల పాటు హోటల్‌లో ఉచితంగా ఉండే అవకాశం లభించింది. మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి” అని పేర్కొంటూ ఓ లింక్ దర్శనమిస్తుంది. పైన ఫోటోలో ఉన్నవాటితో కూడిన ఓ లింక్ పలు వాట్సాప్ గ్రూప్స్, నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇదంతా కూడా ఫేక్ అని తేలింది. ప్రేమికుల కోసం తాము ఎలాంటి గిఫ్ట్ కార్డులు పంపించడం లేదని తాజ్ హోటల్ స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అలాగే ముంబై సైబర్ పోలీస్ వింగ్ కూడా ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించింది.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..