Viral Video: సరస్సులో చకచకా ఈదేస్తున్న తల లేని చేప.. వీడియో వైరల్.. రీజన్ ఏమిటంటే..
వైరల్ అవుతున్న ఓ వీడియో ఇదెలా సాధ్యం అనిపించేలా దర్శనం ఇస్తుంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. ఒక చేప చకచకా చెరువులో ఈదుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే చేపకు తల లేదు. అవును.. మీరు సరిగ్గా చదివారు.
ఇంటర్నెట్‌లో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు మనసుని కదిలిస్తే.. మరికొన్ని ఆహ్లాదకరంగా ఉండి నవ్విస్తూ ఉంటాయి. ఇంకొన్ని సృష్టిలో చిత్ర విచిత్రాలను కనుల ముందుకు తీసుకొచ్చి షాక్ ఇచ్చేవిలా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో ఇదెలా సాధ్యం అనిపించేలా దర్శనం ఇస్తుంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. ఒక చేప చకచకా చెరువులో ఈదుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే చేపకు తల లేదు. అవును.. మీరు సరిగ్గా చదివారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు.. మీరు కూడా వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి..
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను OddIy Terrifying అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్చే శారు. ఈ వీడియో క్లిప్‌లో ఒక సరస్సులో తల లేని చేప ఈత కొడుతూ కనిపించింది. “తల లేకుండా ఈత కొడుతోంది” అనే క్యాప్షన్‌తో షేర్ చేసారు.
ఈ వీడియో లక్షలాది వ్యూస్ ను రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఎక్కువ మంది ఆశ్చర్యపోయారు. అయితే వాస్తవానికి చేపలకు తల లేకపోయినా కొంత కాలం జీవిస్తాయట.. నీటిలో తోక దగ్గర ఉన్న వెన్నెముక సాయంతో ఈదుతాయట. చేపలు అటు ఇటు కదిలి ఇదెలా ఈ వెన్నుపాము మంచి సహాయకారిగా పనిచేస్తుందని తెలుస్తోంది.