Google New Year: 2021 ఏడాదికి గుడ్‌బై చెప్పడానికి అంతా సిద్ధమవుతున్నారు. ఇంకా కొన్ని గంటల్లో కొత్తేడాదిని ఆహ్వానించేందుకు రడీ అవుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు కొత్తేడాది వేడుకలు నిర్వహించుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా జరుపుకునే వేడుకల్లో కొత్తేడాది సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇక కొత్తేడాదిలోకి అడుగుపెట్టగానే న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం సర్వసాధారణమైన విషయం. ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా నూతన సంవత్సరం వేళ అందరూ మనస్ఫూర్తిగా కొత్తేడాది శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా తమ యూజర్లకు విషెస్ తెలిపింది.
అయితే మాములుగా చెబితే దాని ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. అందుకే గూగుల్ డూడుల్ రూపంలో యూజర్లకు న్యూఇయర్ విషెస్ తెలిపింది. 2021 ఏడాదికి వీడ్కోలు చెబుతూ గూగుల్ డిసెంబర్ 31న డూడుల్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే గూగుల్ హోమ్ పేజ్‌పై చాక్లెట్ రూపంతో కూడిన ఓ డూడుల్‌ను క్రియేట్ చేసింది. డూడుల్‌ను క్లిక్ చేయగానే ఒక్కసారిగా కొత్త పేజీ ఓపెన్ అయి.. పేపర్లు కురుస్తున్నట్లు డిజైన్ చేశారు. అలాగే కొత్త పేజీలో న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్‌ను పబ్లిష్ చేశారు. మరెందుకు మీరు కూడా ఓసారి గూగుల్‌పై క్లిక్ చేసి ఈ సరికొత్త అనుభూతిని పొందండి.
Also Read: Taxpayers: మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్నారా..? కావాల్సిన పత్రాలు ఇవే..!
Third Wave Scare in India: దేశంలో థర్డ్‌వేవ్ షురూ..బీకేర్‌ఫుల్.. ఆ ప్రాంతంలో లాక్ డౌన్.. (వీడియో)
Siblings Escape: 14 అంతస్థుల భవనంలో మంటలు… అక్కా తమ్ముళ్ల షాకింగ్ పని..!(వీడియో)