AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusions: ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోపై ఓ లుక్కేయండి.. మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తాయి..

Optical Illusions: ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనం చూస్తోంది నిజమేనా..? కాదా అన్న అనుమానాన్ని కలిగిస్తాయి ఇలాంటి ఫోటోలు. ఒకప్పుడు ఇలాంటి ఫోటోలు ఎక్కువగా వార్త పత్రికల్లో కనిపించేవు. పలానా ఫోటోను దీక్షణంగా చూస్తే ఒక జంతువు కనిపిస్తుంది. గుర్తించండి అంటూ...

Optical Illusions: ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోపై ఓ లుక్కేయండి.. మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తాయి..
Narender Vaitla
|

Updated on: Apr 08, 2022 | 11:38 AM

Share

Optical Illusions: ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనం చూస్తోంది నిజమేనా..? కాదా అన్న అనుమానాన్ని కలిగిస్తాయి ఇలాంటి ఫోటోలు. ఒకప్పుడు ఇలాంటి ఫోటోలు ఎక్కువగా వార్త పత్రికల్లో కనిపించేవు. పలానా ఫోటోను దీక్షణంగా చూస్తే ఒక జంతువు కనిపిస్తుంది. గుర్తించండి అంటూ ఫోటోలు వచ్చేవి. ప్రస్తుతం మారుతోన్న కాలానికి అనుగుణంగా ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటోలు కూడా సోషల్‌ మీడియా బాట పట్టాయి. కంటికి, మెదడుకు మేత పెట్టేలా ఉండే ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌ మారాయి. తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది.

పైన కనిపిస్తోన్న ఫోటోను చూస్తే మీకు ఏం కనిపిస్తుంది.? ఏముంది ఒక పేపర్‌పై రకరకాల రంగులు ఉన్నాయి అంటారు కదూ! అయితే ఓసారి ఈ ఫోటోను తీక్షణంగా చూడండి. కన్నుమూయకుండా ఒక 30 సెకన్లపాటు ఫోటోపైనే మీ ఏకాగ్రతను ఉంచండి అలా చూస్తే మీకు ఒక అద్భుతం కనిపిస్తుంది. ఫోటోను అదేపనిగా దీక్షణంగా చూస్తే అందులోని రంగులన్నీ తొలగిపోయి పూర్తిగా తెలుగు రంగు కనిపిస్తుంది. మళ్లీ చూపును కాస్త పక్కకు తిప్పే గమనిస్తే మళ్లీ రంగులు కనిపిస్తాయి. అదే మరి ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు ఉన్న పవర్. మరెందుకు ఆలస్యం ఈ ట్రిక్‌ను మీరూ ఎంజాయ్‌ చేసి, మీ ఫ్రెండ్స్‌కి పంపించి వారిని సర్‌ప్రైజ్‌ చేయండి.

Viral Photo

Also Read: CNG Gas Prices: వినియోగదారులకు మరో షాక్.. పెరిగిన సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలు.. ఎప్పటి నుంచంటే?

Viral Video: నాగుపాము పొట్టలో సారా సీసా మూత..! వైద్యులకు పెద్ద పరీక్ష.. వైరల్ అవుతున్న పాము వీడియో..

Green chilli price: ఎండు మిర్చి మాత్రమే కాదు.. పచ్చి మిర్చి కూడా దుమ్ములేపుతుంది.. కేజీ ఎంతో తెలుసా..?