సాధారణంగా పోలీసులు నిర్లక్ష్యంగా, నిర్లిప్తతతో ఉన్నప్పుడు ఖైదీలు తప్పించుకుంటుంటారు. అయితే చేతికి సంకెళ్లునప్పటికీ ఒక ఖైదీ కదులుతున్న పోలీస్ వ్యాన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. బ్రెజిల్‌లోని పరైబాలో గతేడాది డిసెంబర్ 28న ఈ ఘటన చోటుచేసుకుంది. అలగోవా నోవా పోలీసులు ఒక ఖైదీ చేతికి సంకెళ్లు వేసి పోలీస్ వ్యానులో స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీస్ వ్యాన్ కదులుతుండగానే వ్యాన్ వెనుక వైపు డోర్ తెరచిన ఖైదీ మెల్లగా రోడ్డుపైకి దూకాడు. అనంతరం అక్కడి నుంచి క్షణాల్లో మాయమైపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కాగా ఖైదీ తప్పించుకున్న సంగతిని చాలా సేపటి వరకు గుర్తించలేకపోయారు బ్రెజిల్ పోలీసులు. వ్యాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాతే ఈ విషయాన్ని గ్రహించడం గమనార్హం. అయితే, ఆ ఖైదీ ఎలా ఎలా తప్పించుకున్నాడో ఇప్పటికీ తమకు అంతుచిక్కడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామంటున్నారు. కాగా ఖైదీ పారిపోయి సుమారు పదిరోజులు పూర్తవుతుందని, అయినా నేటికీ అతని జాడ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా పోలీస్ వ్యాన్ నుంచి ఖైదీ తప్పించుకున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొందరు వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటనను నమ్మలేకపోతున్నామని కొందరు. ఖైదీ చేతికి నిజంగా సంకెళ్లు వేశారా? అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్న ఖైదీ మాత్రం చాలా ఇంటెలిజెంట్ అని ఇంకొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు.
Also read:
Coronavirus: సినిమా తారలను వెంటాడుతున్న కరోనా.. వైరస్ బారిన పడిన సత్యరాజ్.. ఆస్పత్రిలో చికిత్స..
Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు పాజిటివ్..