ఫేస్‌బుక్‌లో అమ్మకానికి సగం తిన్న శాండ్‌విచ్‌.. దాని ధర రూ.10కోట్లు..! ఇది ఎవరిదో తెలుసా..?

|

Jan 16, 2024 | 1:58 PM

ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటివి పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి తన భోజనం ఫోటోను ఇక్కడ పోస్ట్ చేశాడు. అందులో వండిన బంగాళదుంపలు, చిక్కుడు కూర ఉన్నాయి. తినడానికి ప్లేట్ లేదని రాశారు. అందువల్ల ఈ లంచ్‌ను మైక్రోవేవ్‌లో గాజు ప్లేట్‌లోనే సర్వ్‌ చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్ శీర్షికలో ఇలా రాశారు..

ఫేస్‌బుక్‌లో అమ్మకానికి సగం తిన్న శాండ్‌విచ్‌.. దాని ధర రూ.10కోట్లు..! ఇది ఎవరిదో తెలుసా..?
Sandwich On Sale
Follow us on

శాండ్‌విచ్ ధర అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో వివిధ రకాలు, పలు రుచుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో సుమారు రూ. 30 నుండి 40 రూపాయల వరకు శాండ్‌విచ్‌ లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఒక శాండ్‌విచ్ గరిష్టంగా 500 లేదా 1000 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఫేస్‌బుక్‌లో శాండ్‌విచ్ ఎంత ధరకు అమ్ముడవుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ శాండ్‌విచ్ ఇక్కడ 1.3 మిలియన్ డాలర్లకు అంటే దాదాపు రూ.10 కోట్లకు అమ్ముడవుతోంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. శాండ్ విచ్‌లోని సగ భాగం మాయమైంది.. అంటే ఇది ఒకరు ఎంగిలి చేసి వదిలేసిన శాండ్‌విచ్ అని అర్థమవుతుంది.. అయినప్పటికీ ఇంత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో అందరూ అయోమయంలో పడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్‌ చూసిన ప్రజలు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నివేదిక ప్రకారం, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో ఈ సగం తిన్న శాండ్‌విచ్ అమ్మకానికి పోస్ట్ చేయబడింది. ఇక్కడ ప్రజలు ఉపయోగించిన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. శాండ్‌విచ్ గురించి సవివరమైన సమాచారం కూడా ఇవ్వబడింది. ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌కు చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మకానికి పోస్ట్ చేశాడు. ఇది కొత్త గ్రిల్డ్, సగం తిన్న శాండ్‌విచ్ అని వివరాలలో పేర్కొన్నాడు. అందులో చీజ్, కొంత నాన్‌వెజ్‌తో కలిపి తయారు చేశారు. శాండ్‌విచ్ చాలా క్రిస్పీగా ఉందంటూ వర్ణించారు. శాండ్‌విచ్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి దాన్ని పూర్తిగా తినలేకపోవటంతో విక్రయిస్తున్నట్లు రాశారు.

ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటివి పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి తన భోజనం ఫోటోను ఇక్కడ పోస్ట్ చేశాడు. అందులో వండిన బంగాళదుంపలు, చిక్కుడు కూర ఉన్నాయి. తినడానికి ప్లేట్ లేదని రాశారు. అందువల్ల ఈ లంచ్‌ను మైక్రోవేవ్‌లో గాజు ప్లేట్‌లోనే సర్వ్‌ చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్ శీర్షికలో ఇలా రాశారు..తాను మొబైల్ ఇంజనీర్‌నని, తన వ్యాన్‌లో మైక్రోవేవ్ ఉందని చెప్పాడు.. కానీ తాను ఆహారం తినేందుకు కావాల్సిన ప్లేట్‌ మర్చిపోయాను, కాబట్టి నేను మైక్రోవేవ్ ప్లేట్‌ని ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పాడు. అందుకుగానూ. తనను క్షమించాలంటూ కూడా అతడు రాసుకొచ్చాడు. గతంలోనూ ఫేస్‌ బుక్‌లో ఈ పోస్ట్‌ చూసిన ప్రజలు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..