మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అద్వితీయమైన ఊరేగింపు జరిగింది. ఇక్కడ ఓ వరుడు వధువును తీసుకెళ్లేందుకు గుర్రం బగ్గీలు, కారుకు బదులుగా ఎద్దుల బండిపై వెళ్లాడు. పెళ్లికూతురు కూడా సంతోషంగా ఎద్దుల బండిపై అత్తమామల ఇంటికి వెళ్లటం అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ అపూర్వ కళ్యాణోత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో ప్రజలు కూడా ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే చర్చనీయాంశంగా మారింది. గ్వాలియర్‌లో ఈ ఊరేగింపు ప్రారంభమైన వెంటనే, ప్రజలు దీనిని చూడటానికి ఎగబడుతున్నారు. ఈ ఊరేగింపు వీడియో, ఫోటోను ప్రజలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ మార్చేస్తున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే వైరల్‌గా మారడం మొదలైంది. ఖరీదైన వాహనాల్లో వెళ్లే వారు కూడా ఈ దృశ్యాన్ని అలా చూస్తుండిపోయారు.
నివేదిక ప్రకారం..పెళ్లికి సంబంధించి ఇలాంటి వింత ఊరేగింపు నగరంలోని ఖిలా గేట్ కూడలికి బయలుదేరింది. పెళ్లి ఊరేగింపుకు 10 ఎద్దుల బండ్లను ఏర్పాటు చేశారు. ఈ 10 ఎద్దుల బండ్లను ఇంటి బంధువుల కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పెళ్లి ఊరేగింపు ఎద్దుల బండిపై తీస్తున్న వీడియోలను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. అందులో వృద్ధులే కాకుండా పిల్లలు కూడా కూర్చున్నారు.
ग्वालियर के एक गांव में निकाली गई बारात ने सभी का ध्यान खींचा। ये बारात महंगी-महंगी गाड़ियों की बजाय बैलगाड़ी पर निकाली गई। इस नजारे को देखकर लोग हैरान रह गए। pic.twitter.com/4lSvE2HlCE
— Rakesh kumar patel (@NanheRakesh) December 6, 2023
పెళ్లి ఊరేగింపును ఎద్దుల బండిలో తీసుకెళ్లాలనేది అతని దివంగత అమ్మమ్మ కోరిక అని తెలిసింది. తన కుటుంబంలోని పిల్లలలో ఒకరి పెళ్లి ఊరేగింపు ఎద్దుల బండిపై నిర్వహించాలని చెప్పారట. దాంతో వారి అమ్మమ్మ కోరిక మేరకు వరుడు ఇలా తన పెళ్లి ఊరేగింపును ఎద్దుల బండిపై ఏర్పాటు చేసుకున్నాడు. తనకు మద్దతుగా వధువు కూడా ఎద్దుల బండిపై తన అత్తమామల ఇంటికి వచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..