
పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అనే సామేత వినే ఉంటారు. నిజమే.. రోజూ ఒకే రకమైన వంటకాలను తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు.. కొత్తగా.. సరికొత్తగా ట్రై చేస్తూ టెస్టీ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో స్ట్రీట్ ఫుడ్స్.. వంటకాల వీడియోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే.. ఒక్కో వంటకాన్ని మరో వంటకంతో కలిపి సరికొత్త వంటకం రెడీ చేస్తున్నారు.. పింక్ టీ అని.. సమోసా బజ్జీ.. చాక్లెట్ పానిపూరీ.. ఇలా ఒక్కటేమిటి అనేక రకాల వంటకాలు చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో విచిత్ర వంటకం వచ్చి చేరింది. అదే గులాబ్ జాము చాట్. ఏంటీ షాకయ్యారా? నిజమే.. గులాబ్ జాముతో చాట్.. మరి దానిని ఎలా రెడీ చేస్తున్నారు.. దాని టెస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందామా.
ఆ వీడియోలో ఓ వ్యక్తి ప్లేట్లో నాలుగు గులాబ్ జాములు వేశాడు. ఆ తర్వాత వాటిపై పెరుగు వేశాడు. ఆ తర్వాత స్వీట్ అండ్ స్పైసీ చట్నీని వేసి.. ఆఖరికి నమ్కీన్తో పాపడాలు వేశాడు. ఆ గులాబ్ జాము చాట్ టెస్ట్ చేసిన వ్యక్తి సూపర్ ఉందంటూ రివ్యూ కూడా ఇచ్చేశాడు.. ఈ విచిత్ర వంటకాన్ని చూసి అక్కడున్నంత వారంత ఆశ్చర్యపోతున్నారు. అలాగే మరికొందరు గులాబ్ జాము చాట్ పై రకారకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..
RRR Movie: జక్కన్న సినిమాకు ఊరట.. ఆర్‌ఆర్‌ఆర్ ప్రదర్శనను నిలిపేయాలన్న పిల్ కొట్టేసిన హైకోర్టు..
Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..